కనుమునాడు ప్రతి ఇంట్లోను గారెలను వండుకుంటారు. ఎందుకంటే కనుమునాడు మినుము తినాలనీ, తినకపోతే యముడు ఇనుము కొరికిస్తాడనీ అంటారు. కనుము – ఇనుము... ప్రాసకుదిరిందని పెద్దలు ఈ ఆచారం పెట్టారంటూ ఆక్షేపిస్తారు. కొందరు. అది ఆచారాల అంతరార్థం తెలియని వారి సంగతి.  

మరింత సమాచారం తెలుసుకోండి: