నేడు రామభక్త హనుమాన్ జయంతి. ఉపద్రవాల నుండి కాపాడే ఆపద్భాందవుడు.కలవరపడి కరుణించమని అడిగిన వెంటనే కరిగిపోయి వరాలు కురిపించే ఏకైక దైవం.సాక్షత్తు అవతారమూర్తిని ఆదుకున్న అనంత బలశాలి .. రామ భక్తుడు శ్రీ ఆంజనేయుడు. బుద్ధిమాన్ద్యమును తొలగించి , చురుకు తనము కలిగించి మనస్సును ఉల్లాసంగా , ప్రశాంతంగా ,శక్తివంతం గ చేసే దైవం హనుమాన్. అందుకనే విద్యా రంగం లో మంచి విజయాలు సాధించాలి అనుకునే వారు హనుమత్ ఉపాసన చెయ్యాలి. ఉపాసన అనగానే పెద్ద పెద్ద మంత్రాలు ఉపదేశం తీస్కోడం వాటిని అనేక నియమాల మధ్య జపాలు చెయ్యడం లాంటివి అనుకుని భయపడవద్దు. అర్చనాత్మక విధానమే చాలా శ్రేయస్కరం . స్వామి వారి అష్టోత్తర శతనామాలు , హనుమాన్ చాలీసా లు చాలా ప్రభావంగ పనిచేసి మనకి అంచనాలకి మించిన ఫలితాలను అందిస్తాయి. 


శ్రీరామ భక్త హనుమా

Image result for హనుమాన్ జయంతి apherald

నేడు హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో స్వామి వారి ఆశీస్సుల కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. కరీంనగర్ జిల్లా కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో నేడు హిందూ స్వాభియాన్ యాత్రను నిర్వహించనున్నారు. ఈ యాత్రలో పరిపూర్ణానందస్వామి వారు పాల్గొననున్నారు.


హనుమాన్ జయంతి సందర్భంగా ఊరేగింపుగా హనుమాన్ భక్తులు


"యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్

భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్""

ఎక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును" అని అర్థం.  . ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షస మూకకు, దుర్మార్గుల పాలిట యమునిగా తాను నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడని చెబుతారు. సుగ్రీవుని దర్శించడానికి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం సమీపిస్తున్నప్పుడు తొలిసారిగా వారికంట పడ్డాడు హనుమంతుడు. మరుక్షణంలో శ్రీరాముని హృదయం చూరగొన్నాడు. ఆ స్థితి ఆయన రామచంద్రుని కోరి పొందిన వరం. నిరంతరం రామనామ సంకీర్తనా తత్పరుడు మారుతి. అందుకే రామభక్తులలో ఆయనకొక్కనికే పూజార్హత లభించింది. 


జై శ్రీ హనుమాన్

హనుమాన్ పూజా విధానం :

చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలూ చేకూరుతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజచేసే భక్తులు, పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు. 


శ్రీఆంజనేయ స్వామి  ప్రత్యేక పూజలు


పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా “ఓం ఆంజనేయాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్‌ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం.  


మరింత సమాచారం తెలుసుకోండి: