సౌతాఫ్రికాతో 3 టెస్టుల సీరీస్ కు వెళ్లిన టీం ఇండియా మరో రెండు రోజుల్లో మొదటి మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న ఇండియా జట్టుకి ఈ సీరీస్ చాలా ముఖ్యమైనది. తొలి టెస్టు బాగా ఆడాలనే ఉద్దేశంతో టీం ఇండియాకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సలహాలు.. సూచనలు ఇచ్చాడు. తన 24 ఏళ్ల టెస్టు క్రికెట్ కెరియర్ లో ఇండియా ఇప్పుడున్నంత పటిష్టంగా ఎప్పుడు లేదని అన్నారు సచిన్ టెండుల్కర్. 


బౌలింగ్, బ్యాటింగ్ రెండిటిలోనూ ఇండియా సత్తా చాటుతుందని.. టెస్టు మ్యాచ్ లో తొలి రోజు చాలా కీలకమైందని బ్యాటింగ్ అయితే భారీ స్కోర్ చేసేలా.. బౌలింగ్ అయితే వికెట్లు తీసేలా దృష్టి పెట్టాలని అన్నారు. కొహ్లి తన బ్యాటింగ్ తాను చేస్తే భారీ స్కోర్ వస్తుందని.. ఇక ప్రస్తుతం కొహ్లి జట్టుకి హార్ధిక్ పాండ్య ఆయుధం అయ్యాడని అన్నారు సచిన్. 


అతన్ని ఏ స్థానంలో దించినా మంచిదే అని.. బౌలింగ్ లో 17 నుండి 18 ఓవర్లు.. బ్యాటింగ్ లో 7,8 స్థానాల్లో దించినా హార్ధిక్ పాండ్యా సత్తా చాటుతాడని అన్నారు. కేప్ టౌన్ లో తొలిటెస్టుకి టీం ఇండియా సర్వం సిద్ధమవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: