టీమిండియా ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్‌పై బీసీసీఐ వేటు వేసింది.  డోప్‌ టెస్ట్‌లో విఫలం కావటంతో అతనిపై 5 నెలల వేటు వేస్తున్నట్లు ప్రకటించింది.   గతేడాది ఓ దేశీవాళి టీ-20 మ్యాచ్‌ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో యూసఫ్‌ నిషేధ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు తేలింది.  దీంతో యూసఫ్ పఠాన్ పై బీసీసీఐ  తాత్కాలిక వేటును వేసింది. కాగా, యూసఫ్ పఠాన్ ఇచ్చిన వివరణతో బీసీసీఐ సంతృప్తి చెందడంతో ఈ వేటును ఐదు నెలలకు కుదించింది.
Image result for yusuf Pathan
అయితే ఆగష్టు 15, 2017 నుంచే ఆయనపై వేటు ఉండగా.. ఇది 2018 జనవరి 14 అర్ధరాత్రికే ముగియనుంది. దీంతో వచ్చే ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడేందుకు యూసఫ్ సిద్ధమయ్యారు.   టర్‌బ్యూటలైన్‌(దగ్గు మందుకు సంబంధించింది) పదార్థాన్ని యూసఫ్‌ తీసుకున్నాడు. అయితే  ఆటగాడు అలాంటి  డ్రగ్‌ను తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే మాత్రం అందుకు అధికారులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ యూసఫ్ డాక్టర్లకు తెలుపలేదు. 
Image result for yusuf Pathan
ఇక డోపింగ్‌ ఆరోపణలు వచ్చినప్పుడే బీసీసీఐ అతన్ని తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది.  వచ్చే ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడేందుకు యూసఫ్ ఆడేందుకు సిద్దం కావడంతో..యూసఫ్ పఠాన్ బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తనకు మద్ధతుగా ఉన్న కుటుంబసభ్యులు, సన్నిహితులందరికీ ఆయన థ్యాంక్స్ చెప్పారు. గొంతు నొప్పి కోసం ఒకసారి తెలియక వేసుకున్న టాబ్లెట్ వలనే ఇలా అయిందని, ఇకపై జాగ్రత్తగా ఉంటానని హామీ ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: