నేడు శ్రీలంకతో జరగనున్న ముక్కోణపు టీ20 సిరీస్ శ్రీలంక వేదికగా ఆరంభం కాబోతోంది..శ్రీలంకలోని కొలంబో వేదికగా ఈ రోజు రాత్రి 7 గంటలకి తొలి పోరు జరుగనుంది..జట్టులోకి కొత్తగా వచ్చిన కుర్రాళ్ళు శ్రీలంకని ఎలా ఎదుర్కోబోతున్నారో ఈరోజు జరగబోయే తోలి మ్యాచ్ లో తెలియనుంది..అయితే.. కెప్టెన్ విరాట్ కోహ్లి, మహేంద్రసింగ్ ధోని, హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్‌ లకి విశ్రాంతి ఇచ్చిన నేపధ్యంలో ఇప్పుడు ఈ పోరు ఎంతో ఆసక్తి కరంగా మారనుంది..

 Triangular T20 tournament from today - Sakshi

ధోనీ స్థానంలో జట్టులోకి రిషబ్ పంత్‌పై వచ్చాడు దాంతో ఇప్పుడు అందరి దృష్టి అతనిపైనే నిలిచింది..ఈ సీరీస్ లో భారత్ తో పాటుగా శ్రీలంక ,బంగ్లాదేశ్ పోటీ పడనున్నాయి..ఈ మూడు జట్లు కూడా ఒక్కో టీం తో రెండు మ్యాచ్ లు ఆడుతాయి..చివరగా నిలిచినా రెండు జట్లుకి 18న ఫైనల్లో తలపడతాయి...రోహిత్ సారధ్యంలో ఇప్పుడు జట్టు నడవనుంది..అయితే ఇదే ఇప్పుడు రోహిత్ శర్మ కి పెద్ద సవాల్ అని చెప్పచ్చు ఎందుకంటే..జట్టులో ఎక్కువ మంది కుర్రాళ్ళు ఉండటం జట్టుని రోహిత్ ఎంతవరకూ సమర్ధవంతంగా నడిపించగలడోనని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు..

 సంబంధిత చిత్రం

శ్రీలంక టూర్ కి వెళ్ళిన భారత జట్టు - రోహిత్ శర్మ (కెప్టెన్)..శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్)..కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, చాహల్, అక్షర్ పటేల్, విజయ్ శంకర్, శార్ధూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్)


మరింత సమాచారం తెలుసుకోండి: