క్రికెటర్ "షమీ" ని తన భార్య హసీన్ జాహన్ వదిలేలా లేదు..ఇప్పటికే హసీన్  బీసీసీఐ కి ముందు తన అభ్యర్ధనని ఉంచగా..క్రికెటర్ల వ్యక్తిగత, వైవాహిక విషయాల్లో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) జోక్యం చేసుకోదని తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా ఆమెకి స్పష్టం చేసిన విషయం విదితమే అయితే ఈ సమయంలో ఆమె షమీని ఎలా అయినా సరే వదలకూడదనే ఉద్దేశ్యంతో ఐపీఎల్ సీజన్‌లో ఎలాగైనా సరే అతడిని ఆడకుండా చేయాలంటోంది..అందుకు తగ్గట్టుగానే..

 Image result for mohammed shami

షమీని భార్య హసీన్ జాహన్ శనివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్ సీఈఓ హేమంత్ దువాను కలిసింది..ఆ తరువాత జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె 'ఐపీఎల్ ఢిల్లీ ఫ్రాంచైజీ యజమాని హేమంత్ దువాని కలిసి “షమీ” ని ఈ  సీజన్లో ఆడించవద్దని కోరానని..మా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు, షమీపై నమోదైన కేసుల వ్యవహారం తేలేంతవరకు షమీని ఢిల్లీ జట్టుకు దూరం చేయాలని' ఆ ఫ్రాంచైజీ సీఈఓను కోరినట్లు వివరించింది. 

 Image result for mohammed shami wife

అయితే ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డ  షమీ ని కలిసేందుకు హసీన్ జహాన్ వెళ్లగా ఆమెను కలిసేందుకు క్రికెటర్ నిరాకరించిన విషయం తెలిసిందే. షమీ తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని పలు ఆరోపణలు చేస్తూ హాసిన్ జాహన్  ఫిర్యాదు చేయగా టీమిండియా పేసర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.అయితే పలు కేసుల్లో షమీ  కి క్లీన్ చీట్ ఇవ్వడంతో ఐపీఎల్ లో ఆడటానికి సిద్దపడ్డాడు..మరి షమీ  భార్య విన్నపాన్ని ఢిల్లీ డేర్‌డెవిల్స్ సీఈఓ అంగీకరిస్తాడో లేదో వేచి చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: