ఫిఫా సామన్యంగా ఫుడ్ బాల్ మ్యాచ్ లు అంటే ఎవరూ అంతగా ఆసక్తి చూపించరు..అయితే ఇంగ్లాండ్ లో మాత్రం ఫిఫా కోసం అక్కడి అభిమానులు ప్రతీ ఒక్క వ్యక్తీ ఎంతో ఇష్టంగా వీక్షిస్తారు ఎంత ఇష్టం అంటే..తమ దేశపు రాకుమారుడి వివాహాన్ని సైతం పక్కన పెట్టి ఫిఫా మ్యాచ్ చూసేలా..ఇప్పుడు ఈ వార్త సంచలనం అయ్యింది.,.అసోసిఅల్ మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది..వివరాలలోకి వెళ్తే

 Image result for england tunisia

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది  క్రీడా ఔత్సాహికులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫాలో ఆటకి తగ్గట్టుగానే ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి...రష్యా వేదికగా జరుగుతున్న పోటీలలో స్టార్ ప్లేయర్లు తమ సత్తా చాటుతున్నారు..మొన్నటికి మొన్న తొలిసారి ప్రపంచకప్‌ అర్హత సాధించి మొదటి మ్యాచ్‌ ఆడింది ఐస్‌లాండ్‌...అయితే అర్జెంటీనాతో జరిగిన ఈ మ్యాచ్‌ను ఐస్‌లాండ్‌ దేశం మొత్తం అంటే దాదాపు 99.6 శాతం మంది  చూసినట్లు ఆ దేశ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. అంతే ఆశ్చర్యకరమైన సంఘటన మరొకటి సంభవించింది.అ..అదేంటంటే..

 Image result for england tunisia

 తాజాగా ఓ సర్వే వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇంగ్లాండ్ దేశపు ప్రిన్స్‌ హ్యారీ మేఘన్‌ మెర్కెల్‌ను పెళ్లి చేసుకున్నాడు...అయితే దీని కంటే కూడా ఇంగ్లాండ్‌-టునీషియా మధ్య జరిగిన మ్యాచ్‌నే ఎక్కువ మంది వీక్షించారట..మే 19న హ్యారీ-మేగనా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వీరి వివాహాన్ని ప్రపంచ వ్యాప్తంగా 190 కోట్ల మంది వీక్షించారు. ఇందులో ఒక్క లండన్‌ నుంచే 18 మిలియన్ల మంది వీక్షించారు...

 Image result for fifa world cup england prince marriage

అయితే  అదే రోజు సోమవారం ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌-టునీషియా మధ్య జరిగిన మ్యాచ్‌కు లండన్‌ వాసులు బ్రహ్మరథం పట్టారు...ఈ మ్యాచ్‌ను యూకేలో 18.3 మిలియన్ల మంది చూశారట. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌ ఫీవర్‌ ఎలా ఉందో.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ హ్యారీ కేన్‌ రెండు గోల్స్‌ చేయడంతో 2-1 తేడాతో టునీషియాపై విజయం సాధించింది. టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్‌ తన తదుపరి మ్యాచ్‌లో పనామాను ఢీకొట్టనుంది..ఫిఫా నా మజాకానా అంటున్నారు అభిమానులు..

 


మరింత సమాచారం తెలుసుకోండి: