కోహ్లీ పేరు చెప్పగానే రికార్డులు అన్నీ ఒక్కసారిగా తన ఖాతాలో చేరిపోతాయి..ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలుచుకోవడం కోహ్లీ కి బ్యాట్ తో పెట్టిన విద్య..ఓవల్ వేదికగా సాగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ విశ్వరూపం చూపించాడు..అంతేకాదు రికార్డుల పరంపర వరదలా సాగింది..అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా (382 ఇన్నింగ్స్‌) 18 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు...చివరి టెస్ట్ లో 49 పరుగులు చేయడంతో ఈ ఘనత సాధించాడు కోహ్లీ అంతేకాదు వరుసగా క్రికెట్ దిగ్గజాలైన మాజీ క్రికెటర్లు బ్రయాన్‌ లారా (411 ఇన్నింగ్స్‌), సచిన్‌ టెండూల్కర్‌ (412 ఇన్నింగ్స్‌), రికీ పాంటింగ్(422 ఇన్నింగ్స్‌)లను దాటేసాడు.

 Image result for kohli england test 18000 runs

 అక్కడి తో ఆగలేదు 18 వేల పరుగులు చేసిన భారత్ తరుపున నిలిచినా ఆటగాడిగా సచిన్‌ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌, సౌరవ్ గంగూలీలు తరువాత కోహ్లీ నిలిచాడు..ఇంగ్లాండ్ పర్యటనతో కోహ్లీ పూర్తి స్థాయి ఫాం లోకి వచ్చాడు..ఇదిలాఉంటే ట్రెంట్ బ్రిడ్జి వేదికగా జరిగిన మూడో టెస్టులో విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 23వ టెస్టు సెంచరీని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రెంట్ బ్రిడ్జి మైదానంలోని హానర్ బోర్డుపై కోహ్లీ పేరు చరిత్రలో నిలిచిపోయింది..అంతేకాదు అతి తక్కువ టెస్ట్ లలో 6000 వేల  పరుగుల చేసిన ఆటగాడిగా మరొక రికార్డు కూడా నెలకొల్పాడు.

 Image result for kohli england test 18000 runs

కోహ్లీ ఈ క్రమమలో సచిన్ “120” ఇన్నింగ్స్‌ల  రికార్డును సైతం బద్దలు కొట్టాడు. 117 ఇన్నింగ్స్‌లలోనే 6 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న సునీల్ గవాస్కర్ ఈ జాబితాలో  ముందుండగా, కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. 120 ఇన్నింగ్స్‌లలో 6 వేల  పరుగులు చేసిన టెండూల్కర్ మూడో స్థానానికి దిగజారాడు... ఆ తర్వాతి స్థానాల్లో వీరేంద్ర సెహ్వాగ్ (121) రాహుల్ ద్రవిడ్ (125) ఉన్నారు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: