తాజాగా పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఆసియాకప్‌లో భాగంగా భారత జట్టు అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లోనే ఆడుతుండడాన్ని తప్పు పడుతూ.. బీసీసీఐపై పరోక్షంగా సెటైర్లు వేశాడు.  ఆసియాకప్‌లో టీమిండియాపై గెలవాలంటే తమ జట్టు అన్ని అం‍శాల్లోనూ మెరుగవ్వాల్సి ఉందని పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్పష్టం చేశాడు. మా జట్లు కొత్త బంతితో ఇంకా బాగా బౌలింగ్‌ చేయాల్సి ఉంది. కావాల్సినంత స్వింగ్‌ను మేం రాబట్టుకోలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తర్వాత సాధన శిబిరంలో మేం దీనిపై పనిచేస్తాం.

India Are Better Side Even Without Virat Kohli, Says Pakistan Captain Sarfraz Ahmed - Sakshi

హాంకాంగ్‌పై మంచి విజయమే సాధించాం. కోహ్లి లేకపోయినా భారత్‌ జట్టు అత్యుత్తమంగానే ఉంది. కోహ్లి లేడనే విషయాన్ని పక్కకు పెట్టే బరిలోకి దిగుతాం.  కానీ భారత్‌పై గెలవాలంటే మాత్రం మేం మూడు విభాగాల్లోనూ అత్యుత్తమంగా ఉండాలి. ఇదిలా ఉంటే..ఇతర జట్లన్నీ అబుదాది, దుబాయ్‌లలో మ్యాచ్‌లు ఆడుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ.. నిబంధనలు అన్ని జట్లకు ఒకేలా ఉండాలని అన్నాడు.

Image result for పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌

కానీ భారత జట్టు విషయంలో మాత్రం చాలా తేడాగా జరుగుతుందని..భారత జట్టు దుబాయ్‌లోనే ఆడించడంపై ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న బీసీసీఐకి వ్యాపార ప్రయోజనాలున్నాయి.  పాక్‌, బంగ్లాదేశ్‌ జట్లతో భారత జట్టు ఆడినప్పుడు అబుదాబి స్టేడియం (20వేలు)కంటే ఎక్కువ (25వేలు) కెపాసిటీ ఉన్న దుబాయ్‌ స్టేడియం ఫుల్‌ అయ్యే అవకాశాలుంటాయి. దాంతో ఆర్థక ప్రయోజనాలు బాగా ఉంటాయని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: