బ్యాడ్మింటన్. అత్యంత ప్రజాదరణ కలిగిన గేమ్ గా బ్యాడ్మింటన్ కి ఒక గుర్తింపు ఉంది. టెన్నిస్ ,బ్యాడ్మింటన్ రెండు ఆటలకి ఇంచుమించు ఒకేలా పోలికలు ఉంటాయి..టెన్నిస్‌కు కండబలంతో పాటు.. బుద్ధి బలమూ కావాలి... కానీ బ్యాడ్మింటన్‌కు కేవలం బుద్ది బలమే పధాన సూత్రం. చేతి మణికట్టు ద్వారా ఇంద్రజాలం చేస్తూ ఆడే ఆటలో బ్యాడ్మింటన్ ఒక ప్రత్యేకమైన గేమ్ గా అభివర్ణించారు..ఎంతో ఆసక్తికరమైన ఈ గేమ్ ఇప్పటి వరకూ ప్రజాదరణ పొందుతూనే ఉంది...నిజానికి బ్యాడ్మింటన్ అంటే ఇంతకుముందు భారత్‌లో పెద్దగా ప్రాధాన్యముండేది కాదు. 

Image result for french open badminton 2018

ప్రత్యేకించి దేశంలో క్రికెట్ మాత్రమే వీక్షించే సమయంలో  ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టోర్నీ ప్రస్తుతం అందరి అభిమానాన్ని చూరగొనే స్థాయికి చేరుకుంది..బ్యాడ్మింటన్ కి సంభందించిన అనేక పోటీలలో ఫ్రెంచ్ ఓపెన్ షిప్ పై అందరూ ప్రధానంగా దృష్టి పెడుతుంటారు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్)లోని సభ్యదేశాలన్నీ ఈ పోటీల్లో పాల్గొంటాయి. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి.

 Image result for శ్రీకాంత్ కిడంబి

ప్రతి విభాగంలో విజేతలుగా నిలిచిన వారికి టైటిల్‌తో పాటు స్వర్ణ పతకాన్ని అందజేస్తారు. రెండో స్థానంలో నిలిచిన వారికి రజతం, మూడో స్థానంలో నిలిచిన వారికి కాంస్య పతకాలను ఇస్తారు. ఈ టోర్నీ ఇప్పటి వరకు అత్యధికంగా మూడు సార్లు డెన్మార్క్‌లోని కొపెన్‌హెగన్‌లో జరిగింది...కానీ ఈ పోటీలకు ఇప్పటివరకు నాలుగు సార్లు మాత్రమే ఆసియా దేశాలు ఆతిథ్యమిచ్చాయి....అయితే రేపటి నుంచీ యొనెక్స్ ఫ్రెంచ్ ఓపెన్ పోటీలు ఐదు రోజుల పాటు ఫారిస్ లో జరుగనున్నాయి..

 Image result for aparna popat

ఇదిలాఉంటే ఇప్పటి వరకూ ఇండియా తరుపున ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలుపొందిన వారి వివరాలు ఒక్కసారి పరిశీలిస్తే..

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్

1983  - నుంచీ 1984 రెండు సంవత్సరాలలో “విమల్ కుమార్”  ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్నారు..

2000 - సంవత్సరంలో సిద్దార్ద్ జైన్

2001  - అభిన్ శ్యామ్ గుప్తా

2017  - లో శ్రీకాంత్ కిడంబి

అయితే  స్త్రీల సింగిల్స్ లో 1998 సంవత్సరంలో అపర్ణా పోపట్  ఒక్కరు మాత్రమే మహిళల విభాగంలో ఇండియాకి ఫ్రెంచ్ టైటిలే తీసుకువచ్చారు ఆ తరువాత ఒక్క మహిళ బ్యాడ్మింటన్ కూడా టైటిల్ సొంత చేసుకోలేక పోయారు. మరి రేపు జరుగనున్న యోనెక్స్ ఫ్రెంచ్ ఓపెన్ లో ఎవరు విజేతలుగా నిలుస్తారో వేచి చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: