ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4 టెస్టుల సీరీస్ లో భాగంగా ఆడిలైడ్ లో జరిగిన తొలి టెస్ట్ ఇండియా విజయ ఢంకా మోగించింది. టీం ఇండియా ఆల్ రౌండర్ ప్రదర్శనతో జట్టుకి విజయాన్ని అందించారు. మొదటి టెస్ట్ లో భారత్ అనూహ్య విజయం జట్టుకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 250 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో పూజారా పూజారా 123 పరుగులు చేశాడు. 


ఇక మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 235 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ట్రావిస్ హెడ్ 72, పీటర్స్ హ్యాండ్ కాంబ్ 34 పరుగులు చేశారు. బూమ్రా, అశ్విన్ చెరి 3 వికెట్లు తీసుకోగా, ఇషాంత్ శర్మ, షమిలు చెరి 2 వికెట్లు తీశారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఇండియా 307 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో కూడా పూజారా 71, రహనే 70 పరుగులు చేశారు. 


రెండో ఇన్నింగ్స్ లో 291కు ఆలౌట్ అయ్యింది ఆశ్ట్రేలియా జట్టు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బూమ్రా, షమి, అశ్విన్ 3 వికెట్లు తీశారు. 31 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా ట్రిప్లో సీరీస్ లో మొదటి మ్యాచ్ విన్ అవడంలో ఇండియా సరికొత్త రికార్డ్ సృష్టించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: