భారత దేశంలో జవాన్లను లక్ష్యంగా చేసుకొని కొంత కాలంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎన్నో దాడులు జరిపారు.  ఆ దాడులను భారత సైన్యం కూడా తిప్పికొడుతూనే ఉంది.  ఈ మద్య మ్మూకశ్మీర్ లోని పుల్వామాలో జైషే ఉగ్రవాది చేసిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.  దానికి ప్రతిదాడిగా భారత వాయుసేన పాక్ ఆక్రమిత ప్రాంతంలోకి వెళ్లి 300 మంది ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. 
Image result for australia vs india army cap
అయితే పుల్వామా దాడిలో అమరజవాన్లకు యావత్ భారత దేశం కన్నీటితో నివాళులర్పించిన విషయం తెలిసిందే.  నేడు ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా భారత జట్టు ఆటగాళ్లు జవాన్లకు నివాళులు అర్పిస్తూ భారత జట్టు మైదానంలోకి దిగనున్నారు.  ఈ నేపథ్యంలో భారత జట్టు ఆటగాళ్లు ఆర్మీ సిబ్బంది ధరించే టోపీలతో మైదానంలోకి అడుగుపెట్టనున్నారు.

ఈ టోపీలను టీమిండియా మాజీ సారథి, లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర సింగ్ ధోని జట్టులోని ఆటగాళ్లకు అందజేశారు. ఈరోజు మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: