ప్రపంచం అంతా ఎంతో ఆసక్తితో తిలకిస్తున్న ఐపీఎల్ మ్యాచ్ లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌–12 సీజన్‌లో ప్లే ఆఫ్‌ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన తొలిజట్టుగా నిలిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై జయభేరి మోగించింది.  చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరబాద్ పై విజయం సాధించింది.


ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (49 బంతుల్లో 83 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), వార్నర్‌ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. హర్భజన్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి గెలిచింది.  అనంతరం షేన్ వాట్సన్ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విజృంభించడంతో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. రైనా (24 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు.  


భువీ, రషీద్‌ చెరో వికెట్‌ తీశారు. వాట్సన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. రైజర్స్‌ కెప్టెన్‌ విలియమ్స న్‌ స్వదేశం వెళ్లడంతో భువనేశ్వర్ కుమార్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అతడి స్థానంలో షకీబుల్‌ హసన్‌ తుది జట్టులోకి వచ్చాడు. రైనా (24 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు.  ఇక వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రైజర్స్‌ కెప్టెన్‌ విలియమ్స న్‌ స్వదేశం వెళ్లడంతో షకీబుల్‌ హసన్‌ ఈ మ్యాచ్‌ బరిలోకి దిగాడు. భువనేశ్వర్‌ సారథ్యం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: