వరల్డ్ కప్ లో భారత్ కు తొలివిజయం.  సమిష్టి విజయం.  ట్రోఫీలో ఫెవరెట్ జట్లుగా బరిలోకి దిగిన ఇండియా దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  దక్షిణాఫ్రికాకు ఇది మూడో పరాజయం.  టైటిల్ ఫెవరెట్ గా అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా పేవలమైన ఆటతీరును ప్రదర్శిస్తోంది.  ఎప్పుడు లేని విధంగా వరసగా మూడు పరాజయాలను మూటగట్టుకుంది.  


బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్ పైన ఇండియన్ బౌలర్లు చాహల్‌ (4/51), బుమ్రా (2/35), భువనేశ్వర్‌ (2/44) చెలరేగిపోయారు. దక్షిణాఫ్రికాను 227 పరుగులకే కట్టడి చేశారు.  మోరిస్‌ (42; 34 బంతుల్లో 1×4, 2×6), రబాడ (31 నాటౌట్‌; 35 బంతుల్లో 2×4)ల ఎనిమిదో వికెట్‌ భాగస్వామ్యం ఆ జట్టుకు కాస్త పోరాడే స్కోరును అందించింది. 


అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇండియా ఈ 227 పరుగుల లక్ష్యాన్ని కేవలం 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.  రోహిత్ శర్మ 122 పరుగులతో సెంచరీ చేయగా, ధోని 34, రాహుల్ 26 పరుగులతో గెలుపుకు బాటలు వేశారు.  ధావన్, కోహ్లీలు తక్కువ పరుగులకే వెనుదిరగడం విశేషం.  భారత్ తన రెండో మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆదివారం రోజున తలబడుతుంది.  


దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: ఆమ్లా (సి) రోహిత్‌ (బి) బుమ్రా 6; డికాక్‌ (సి) కోహ్లి (బి) బుమ్రా 10; డుప్లెసిస్‌ (బి) చాహల్‌ 38; వాండెర్‌ డసెన్‌ (బి) చాహల్‌ 22; మిల్లర్‌ (సి) అండ్‌ (బి) చాహల్‌ 31; డుమిని ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 3; ఫెలుక్వాయో (స్టంప్డ్‌) ధోని (బి) చాహల్‌ 34; మోరిస్‌ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్‌ 42; రబాడ నాటౌట్‌ 31; తాహిర్‌ నాటౌట్‌ (సి) జాదవ్‌ (బి) భువనేశ్వర్‌ 0; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 227. బౌలింగ్‌: భువనేశ్వర్‌ కుమార్‌ 10-0-44-2; బుమ్రా 10-1-35-2; హార్దిక్‌ పాండ్య 6-0-31-0; కుల్‌దీప్‌ యాదవ్‌ 10-0-46-1; చాహల్‌ 10-0-51-4; జాదవ్‌ 4-0-16-0భారత్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (సి) డికాక్‌ (బి) రబాడ 8; రోహిత్‌ శర్మ నాటౌట్‌ 122; కోహ్లి (సి) డికాక్‌ (బి) ఫెలుక్వాయో 18; కేఎల్‌ రాహుల్‌ (సి) డుప్లెసిస్‌ (బి) రబాడ 26; ధోని (సి) అండ్‌ (బి) మోరిస్‌ 34; హార్దిక్‌ పాండ్య నాటౌట్‌ 15; ఎక్స్‌ట్రాలు 7. మొత్తం: (47.3 ఓవర్లలో 4 వికెట్లకు) 230. బౌలింగ్‌: తాహిర్‌ 10-0-58-0; రబాడ 10-1-39-2; మోరిస్‌ 10-3-36-1; ఫెలుక్వాయో 8.3-0-40-1; శాంసి 9-0-54-0


మరింత సమాచారం తెలుసుకోండి: