క్రికెట్ లో గెలుపు ఓటములు నిర్ణయించడం లో కీలక పాత్ర పోషించేది బ్యాట్స్ మెన్, బౌలర్లు మరియు అంపైర్లు.అది ఎన్నోసార్లో వారు నిరూపించారు.తాజాగా మరోసారి నిన్న జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల విండీస్ మ్యాచ్ ఓడిపోవల్సి వచ్చింది.

స్లో ఓవర్ రేట్ వల్ల కెప్టెన్లు కు మ్యాచ్ నిషేధాలు మరియు పెనాల్టీలు పడుతుంటాయి కాని అంపైర్లు కు ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా శిక్ష పడట్లేదు అని ఎంతోమంది ప్రముఖులు తమ ఆగ్రహాన్ని ఐసీసీ పై చూపారు.దీనిపైన సినీ నటుడు ధనుష్ కూడా తన ట్విట్టర్ ద్వారా అంపైర్ కు విండీస్ గెలవడం ఇష్టం లేదు అందుకే విండీస్ ని ఓడించారు అని పేర్కొన్నారు.

అంపైర్లు నిన్న జరిగిన మ్యాచ్ లో నో బాల్ ని గుర్తించలేకపోయారు.అందువల్ల క్రిస్ గేల్ పెవిలియన్ కు వెనుతిరగాల్సి వచ్చింది.ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో ఇలాంటి వివాదం రావడం ఐసీసీకి పెద్ద తలనొప్పి గా మారనున్నది. ఈ ప్రపంచ కప్ పుర్తియ్యేసరికి ఎన్ని వివాదాలకు కారణం అవ్వనున్నదో. వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: