1992 ప్రంప‌చ‌క‌ప్‌లో జ‌రిగిన విధంగానే ఈ సారి కూడా పాక్ ఆడే మ్యాచ్‌లో ఫ‌లితాలు వ‌స్తున్నాయని... ఆ క‌ప్‌ను తాము గెలుచుకున్నామ‌ని.. ఈ సారి కూడా క‌ప్ త‌మ‌దే అని పాక్ అభిమానులు సోష‌ల్ మీడియాలో సంబ‌రాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్లు కూడా ఈ సంతోషంలోనే మునిగి తేలుతున్నారు. అయితే ఇప్పుడు పాక్‌కు పోటీగా ఇండియ‌న్స్ కూడా 2011 సెంటిమెంట్‌ను తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారు.


2011లో జ‌రిగిన‌ట్టుగానే 2019లో కూడా భార‌త్ ఆడే మ్యాచ్‌ల విష‌యంలో జ‌రుగుతుందని.. ఈ సారి ప్ర‌పంచ‌క‌ప్ త‌మ‌దే అని భార‌త అభిమానులు పాక్‌కు ధీటుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు.  ఈ టోర్నమెంట్‌లో ఆదివారం భారత్ మొదటిసారిగా ఓటమిపాలైంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2011లో చూస్తే టీం ఇండియా లీగ్‌లో ఒక్క మ్యాచ్‌లోనే ఓడిపోగా.. ఇంగ్లండ్‌తో మ్యాచ్ టైం అయ్యింది.


ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇప్ప‌టికే ఓ మ్యాచ్ ఓడిపోగా... కీవీస్‌తో జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం వ‌ల్ల ర‌ద్ద‌య్యి ఒక పాయింట్ వ‌చ్చింది. దీంతో ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ 2011 సీన్లు చాలా వ‌ర‌కు జ‌రుగుతుండ‌డంతో ఇప్పుడు టీం ఇండియా ఫ్యాన్స్ పాక్ ప్ర‌చారానికి ధీటుగా స్పందిస్తున్నారు. ఇక భార‌త్ తొలిసారి ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన‌ప్పుడు 1983లో రెండు మ్యాచ్‌ల‌లో ఓడిపోయింది. ఇక లీగ్ దశలో భారత్ శ్రీలంక, బంగ్లాదేశ్‌తో మరో రెండు మ్యాచులు ఆడినుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: