వరల్డ్ కప్ సమయంలో సంచలనం సృష్టించిన అంబటి రాయుడి రిటైర్మెంట్ పై టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు. బీసీసీఐ పై, ముఖ్యంగా తనపై ఎంతగానో వచ్చిన విమర్శలకు కాస్త లేటుగా అయినా స్పందించాడు. విజయ్‌ శంకర్‌, రిషబ్‌ పంత్, మయాంక్‌ అగర్వాల్‌కు ఎందుకు అవకాశం దక్కిందో.. రాయుడుకు ఎందుకు అవకాశం దక్కలేదో వివరించాడు.


“ఆటగాళ్లకు ఉండే భావోద్వేగాలు సెలక్షన్‌ కమిటీకి ఉంటాయి.. అన్నీ ఆలోచించే ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేశాం.. ఆటగాడు రాణిస్తే ఎంత ఆనందిస్తామో..  భావోద్వేగాలతో జట్టుకు దూరమైనా బాధపడతాం.. ఆటగాళ్లపై ఎటువంటి పక్షపాతం, అభిమానం ఉండదు.. త్రీడీ ట్వీట్ ను నేను ఎంతో ఆనందించాను.. సమయానికి తగ్గట్టుగా రాయుడు స్సందించాడు.. ఇది తన గురించే అని ఎందుకనుకున్నాడో తెలియదు.. ఓ సిరీస్ లో ఫెయిలైనా, ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలమైనా అతనిపై నమ్మకం ఉంచాం.. పూర్తి ఫిటెనెస్‌తో ఆడాలని తగిన ఏర్పాట్లు కూడా చేశాం.. కొన్ని కారణాల వల్ల అతను ప్రపంచకప్‌కు ఎంపిక కాలేదు.. సెలక్షన్‌ కమిటీ ఎటువంటి పక్షపాత నిర్ణయాలు తీసుకోలేదు.’ అన్నాడు. బాగానే ఉంది కానీ...


రోహిత్, ధావన్ లాంటివాళ్లకి ఫిట్ నెస్ లేకపోయినా పలుమార్లు అవకాశం ఇచ్చి రాయుడుకు ఎందుకు అవకాశమివ్వలేదో.. రాయుడును స్టాండ్ బై ఆటగాడిగా తీసుకుని కూడా వేరే ఆటగాడిని ఎందుకు పిలిపించారో.. వన్డేల్లో అనుభవమున్న రాయుడును పక్కనపెట్టినప్పుడు, ఒక్క వన్డే కూడా ఆడని మాయాంక్ అగర్వాల్ ని డైరెక్ట్ గా వరల్డ్ కప్ లో ఎందుకు ఆడించారో.. ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలే. మరి ఎమ్మెస్కే.. రాయుడు మీద సానుభూతి చూపించడాన్ని ఎలా నమ్మాలి. ప్రతిభ ఉన్న ఆటగాళ్లని సానబెట్టి కెరీర్ నిలబెట్టాల్సింది బీసీసీఐ. కానీ అది జరగలేదు. ఏదైతేనేం.. ఒక క్రీడాకారుడి క్రీడా జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. జరగరాని నష్టం జరిగాక ఎన్ని ఉపోద్ఘాతాలు ఇచ్చినా ఏం ఉపయోగం.


మరింత సమాచారం తెలుసుకోండి: