డోప్ టెస్ట్ లో విఫలంకావడంతో టీం ఇండియా  యంగ్ క్రికెటర్  పృథ్వీ షా ఫై 8నెలల పాటు నిషేధం విధించింది బీసీసీఐ.  దగ్గు కోసం వాడే సిరప్ లో వుండే   టెర్బుటాలిన్   అనే   నిషేదిత ఉత్ప్రేరకం పృథ్వీ షా సస్పెన్షన్ కు కారణమైయింది.  ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగి వచ్చాక ఈ ఏడాది ఫిబ్రవరి లో పృథ్వీ షా  సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. ఆసమయంలో టెస్ట్ కోసం ప్రుథ్వీ యూరిన్ ను ఇవ్వగా డోప్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలాడు. 


ఇక ప్రుథ్వీ వాడిన  టెర్బుటాలిన్   అనే డ్రగ్ వల్ల ఎముకలు  బలంగా తయారువుతాయి. అయితే దీనిని డ్రగ్ నిరోధక సంస్థ (వాడ) బ్యాన్ చేసింది.  యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్ వెల్లడించిన  నివేదికలో టెర్బుటాలిన్ మందులు తీసుకోవడం  వల్ల వాయురహిత పనితీరును పెంచుతుందని స్పష్టం చేసింది  అనగా  దీనివల్ల సాధారణ పరిస్థితులతో పోల్చితే వ్యక్తి ఆక్సిజన్ లేకుండా ఎక్కువ కాలం జీవించగలడు.  


అయితే, బీసీసీఐ యాంటీ డోపింగ్ మేనేజర్ డాక్టర్ అభిజిత్ సాల్వి టెర్బుటాలిన్ క్రికెటర్ల పనితీరును పెంచే అవకాశమే  లేదన్నాడు. నిజానికి  టెర్బుటాలిన్   వల్ల  క్రికెటర్లకు పెద్దగా ఉపయోగం లేదు. టెర్బుటాలిన్ వాయుమార్గాలను తెరవడానికి అలాగే ఊపిరితిత్తులను సమర్థవంతంగా వెంటిలేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది సైక్లింగ్ చేసే వారికీ, రన్నర్లు మొదలైనవారికి ప్రయోజనకరంగా ఉండవచ్చు, కాని క్రికెటర్ కు మెరుగ్గా రాణించటానికి  సహాయపడదు  అని సాల్వి పేర్కొన్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: