వెస్టిండీస్ క్రికెట్  బోర్డు భారత్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటించింది.   ఈ జట్టులో విండీస్ అల్ రౌండర్ రకిం కార్నివాల్ చోటు దక్కించుకున్నాడు.  కార్నివాల్ చూడడానికి ఆరున్నర అడుగుల  ఎత్తుతో భారీ ఖాయం తో ఉంటాడు. అతడి బరువు 140కిలోలు. ఆతన్ని అందరు మౌంటెన్ మ్యాన్ అని పిలుస్తుంటారు.  అయితే కేవలం అతను  ఆకారం తోనే  కాదు క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. అందులో భాగంగా  ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 55 మ్యాచులు ఆడిన కార్నివాల్ 2224 పరుగులు చేసి 260 వికెట్లు పడగొట్టాడు. ఈప్రదర్శన తో సంతృప్తి చెందిన బోర్డు కార్నివాల్ ను అంతర్జాతీయ క్రికెట్ కు ఎంపిక చేసింది.  మరి  టీం ఇండియా తో జరిగే  టెస్ట్ సిరీస్ లో తుది జట్టులో  కార్నివాల్ చోటు దక్కించుకుంటాడో లేదో చూడాలి. 


ఇక ఇదిలా ఉంటే  విధ్వంసక వీరుడు   క్రిస్ గేల్ కు విండీస్ బోర్డు  షాక్ ఇచ్చింది. గేల్ ఆఖరి కోరికను పరిగణలోకి  తీసుకోకుండా  అతన్ని రిటైర్మెంట్ అయ్యేలా చేసింది.   ప్రపంచ కప్ సమయంలోనే   గేల్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడనికి అందరు అనుకున్నారు..  కానీ స్వదేశంలో భారత్ తో జరిగే టెస్ట్ సిరీస్ ఆడి రిటైర్ కావాలనుకున్నట్లు  ఆ సమయంలో గేల్ వెల్లడించాడు. 

అయితే అతని ఆశల ఫై నీళ్లు చల్లుతూ.. విండీస్  బోర్డు భారత్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు గేల్ ను ఎంపిక చేయలేదు. దాంతో బోర్డు ఫై గేల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇక బోర్డు  తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్ తో జరిగే  మూడవ వన్డే నే గేల్ కు చివరి మ్యాచ్ కానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: