ప్రపంచ కప్ సమయంలో తనకు  జట్టు లో  చోటు దక్కక పోవడంతో  తీవ్ర అసహానికి  గురై క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు టీం ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ఈమేరకు  బీసీసీఐ కి అధికారికంగా లేఖను కూడా పంపాడు.  ఇటీవల రాయుడు  రిటైర్మెంట్ ఫై  పెద్ద చర్చే జరిగింది.  సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని తప్పుబడుతూ అటు క్రికెట్ అభిమానులతో మాజీ ఆటగాళ్లు  రాయుడుకు అండగా నిలిచారు. 


ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు రాయుడు  మరో సారి షాకింగ్  ఇచ్చే నిర్ణయం  తీసుకోనేందుకు సిద్దమయ్యాడట. అదేంటంటే తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోబోతున్నాడని తెలుస్తుంది.  ప్రస్తుతం రాయుడు టీఎన్‌సీఏ వన్డే లీగ్‌లో గ్రాండ్‌శ్లామ్‌ జట్టుకు ఆడుతున్నాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ భారత్‌ తరుఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాలని భావిస్తున్నట్టు తెలిపాడు.అలాగే  ఐపీఎల్లో  కూడా రీ ఎంట్రీ ఇవ్వాలన్న  యోచనలో ఉన్నట్టు చెప్పాడట. 



దాంతో రాయుడు రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.  ఒకేవేళ రాయుడు మళ్ళీ  భారత జట్టు తరపున క్రికెట్ లో కొనసాగాలని భావించిన  అందుకు సెలక్షన్ కమిటీ ఆ అవకాశం ఇస్తుందా  అనేది ప్రశ్నార్ధకమే. రాయుడు రిటైర్మెంట్ ఫై  సెలక్షన్ కమిటీ ఇప్పటివరకు కనీసం స్పందించలేదు.  అలాగే ప్రపంచ కప్ లో  తనను  ఎంపిక చేయకపోవడం తో రాయుడు,  సెలక్షన్ కమిటీ ను ఉద్దేశిస్తూ ..  వ్యంగంగా  ట్వీట్ చేశాడు. అప్పటినుండి సెలెక్టర్లు అతని పట్ల  కఠినంగా వ్యవహరిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: