రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐ‌పి‌ఎల్ లో బలమైన జట్లలో ఒకటి అయినప్పటికి బలమైన ఫలితాలను ఐ‌పి‌ఎల్ టైటిల్ ను గెలవడం లో నిరంతరం విఫలమవుతూ వస్తుంది. అందువలన "ఆర్‌సి‌బి " కి మునపటి సీజన్లకి పని చేసిన కోచ్ గ్యారీ కిర్ స్టెన్ మరియు బౌలింగ్ కోచ్ గా పని చేసిన ఆశిష్ నెహ్రా ని ఆ పదవుల నుంచి తొలగిసస్తూ వారి స్థానం లో మాజీ న్యూ జిలాండ్ కోచ్ మైక్ హెస్సన్ ను క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా, ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్ మెన్ సైమన్ కటిచ్ ను ప్రధాన కోచ్ గా నియమిస్తున్నట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుక్రవారం ఆగష్టు 23 న అధికారకం గా ప్రకటన చేసింది. ఇంతకముందు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ లేనందున ఆర్‌సి‌బి ఒక కొత్త పాత్ర ని సృషించింది.


మాజీ భారత పేసర్ నెహ్రా మరియు  2011 ప్రపంచ కప్ విజయంలో భారతదేశంతో సహా విస్తారమైన కోచింగ్ అనుభవం ఉన్న మాజీ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ కిర్ స్టెన్ , న్యూ జిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి ఆర్‌సి‌బి కోచ్ నుంచి తప్పించిన తర్వాత నియమించబడ్డారు. కెప్టెన్ కోహ్లీ తో పాటు వీరి  నాయకత్వం లో చివరి రెండు సీజన్లలో ఆర్‌సి‌బి ఆరవ స్థానం మరియు చిట్ట చివరి స్థానం లో నిలిచింది. ఆ ఫలితాలు యాజమాన్యం ని పునరాలోచనలో పడవేసింది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క చైర్మన్ సంజీవ్ చురివాలా ఆర్‌సి‌బి  ఉద్దేశ్యం అత్యంత విశ్వసనీయమైన, గౌరవనీయమైన మరియు ఉత్తమంగా పనిచేసే టి 20 ఫ్రాంచైజీ. అందువల్ల జట్టులోని ప్రతి సభ్యునికి శ్రేష్ఠత మరియు అధిక పనితీరు యొక్క సంస్కృతిని సృష్టించడం మా నిరంతర ప్రయత్నం" అని ఆయన ఒక మీడియా ప్రకటనలో తెలిపారు. వచ్చే సీజన్ కి ఆర్‌సి‌బి ని ఒక బలమైన జట్టు గా తీర్చిదిద్దాలని మైక్ హెస్సన్ ను క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా, సైమన్ కటిచ్ ను ప్రధాన కోచ్ గా నియమించింది.
          
 హెస్సన్ గతంలో న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గా  విజయం సాధించాడు మరియు ఇటీవల భారతదేశం యొక్క తదుపరి ప్రధాన కోచ్ గా  ఎంపికైన ఆరుగురు షార్ట్ లిస్ట్ అభ్యర్థులలో ఒకడు.హెస్సన్ ఇటీవలే ఐపీఎల్ 2019 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్ గా కూడా పనిచేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హెస్సన్ మరియు కటిచ్ ఇద్దరూ ఐపిఎల్ యొక్క 2019 సీజన్ తరువాత ఆయా ఫ్రాంచైజీలచే విడుదల చేయబడ్డారు.కటిచ్ ఐపిఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్‌గా 2019 సీజన్ వరకు పనిచేసిన అనుభవం ఉంది. వీరి ఆధ్వర్యం లో అయిన  ఆర్‌సి‌బి మంచి విజయాలు సాధించాలని కోరుకుందాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: