ఢిల్లీ క్రికెట్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేసిన దివంగత నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి తగిన గౌరవం ఇవ్వాలని ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) నిర్ణయించింది. ఢిల్లీలోని ప్రఖ్యాత ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టాలని డీడీసీఏ నిర్ణయించుకుంది. ఈ నెల 7 వ తేదీన శ్వాససంబంధిత కారణంగా ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అరుణ్ జైట్లీ చేరారు. 


గత శనివారం ఢిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య సిబ్బంది చేత చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు అరుణ్ జైట్లీ. ఈ నేపథ్యంలోనే అరుణ్ జైట్లకి స్మారకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీడీసీఏ పేర్కొంది. స్టేడియం పేరును అరుణ్‌జైట్లీ స్టేడియంగా మారుస్తున్నామని మైదానానికి ఫిరోజ్‌ షా కోట్ల పేరునే కొనసాగిస్తున్నట్లు డీడీసీఏ క్లారిటీనిచ్చింది. 


ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన కాలంలో జైట్లీ చేసిన కృషి అసామాన్యమని, విరాట్ కోహ్లీ, వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా, రిషబ్ పంత్ వంటి అనేకమంది క్రికెటర్లు జైట్లీ సపోర్ట్ తో భారతదేశం గర్వించేలా ప్రదర్శన చేశారని, ఇప్పటికి చేస్తున్నారని డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ తెలిపారు. స్టేడియం పేరు మార్పు కార్యక్రమం సెప్టెంబర్ 12న నిర్వహించనున్నారు.  ఈ సందర్భంగా కోట్లా స్టేడియంలో ఓ స్టాండ్‌కు విరాట్ కోహ్లీ పేరు పెట్టనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: