టీం ఇండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ పదే పదే అవకాశాలు చేజిక్కించుకుంటున్నప్పటికీ తనని తాను నిరూపించుకోవడంలో మాత్రం విఫలం అవుతున్నాడు. ఎం ఎస్ ధోనీ తర్వాత భారత క్రికెట్ వికెట్ కీపర్ గా కొనసాగాలని అందరూ అనుకుంటున్నప్పటికీ అతని ప్రదర్శన కారణంగా టీంలో అతని స్థానంపై నమ్మకం లేకుండా పొతుంది.  ప్రస్తుతానికి టీం ఇండియా యాజమాన్యం వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ వైపే మొగ్గు చూపుతుంది.


అయితే పంత్ ఇటీవల కాలంలో ఒకే తరహా షాట్ కి ఔట్ అవుతున్నాడు. డీప్ స్క్వేర్ లెగ్ లో ఔట్ అవుతున్న తీరు టీంలో అతని స్థానాన్ని ప్రశ్నార్థకంలో పడేసేలా ఉంది. ఇప్పటికే అతని ఆట తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. అతన్ని తప్పించి మరో టాలెంటెడ్ వికెట్ కీపర్ అయిన సంజూ శాంసన్ కి చోటివ్వాలనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ విషయంలో గౌతమ్ గంభీర్ కూడా పంత్ ని హెచ్చరించాడు.


తన ఆట తీరును మార్చుకోకపోతే ఆ స్థానంలో సంజూ శాంసన్ రావడం చాలా ఈజీ అని అలా జరగకుండా ఆట తీరుఉ మార్చుకోవాలని చెప్పాడు. భారత క్రికెట్ టీం కోచ్ రవిశస్త్రి కూడా రిషబ్ ఆటని మార్చుకోవాలని, లేకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించాడు. ఆటలో టాలెంట్ ఉందా లేదా అనే కంటే, నిలకడగా ఆడుతున్నాడా లేదా అనేది ముఖ్యమని అన్నాడు.


ట్రినిడాడ్ మ్యాచ్ లో అతను తొలి బంతికే ఔట్ అయిన తీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే టీంలో నుండి ఉద్వాసన తప్పదని, ఇక్కడ పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేస్తేనే టీంలో ఎక్కువ కాలం కొనసాగుతారని, ఇకనైనా పంత్ తనని తాను నిరూపించుకోవడానికి ఆట మీద దృష్టి పెట్టాలని  అన్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: