చాలా రోజుల నుండి రిషబ్ పంత్ ఆట తీరుపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. ఆయన ఆట తీరు మార్చుకోవాలని సీనియర్ ఆటగాళ్లయిన గంభీర్, కోచ్ రవిశాస్త్రి లాంటి వాళ్ళు సైతం హెచ్చరించారు.  వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో పంత్ ఆటతీరుని అందరూ విమర్శించారు. ఆయన ఆటతీరుని మార్చుకోకపోతే ఉద్వాసన తప్పదని హెచ్చరించరు. అయితే రిషబ్ పంత్ ఆట తీరులో అసలేమీ మార్పు రాకపోవడంతో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ మ్యాచ్ లో పంత్ స్థానంలో వృద్ధిమాన్ సాహాని తీసుకున్నారు.


ఇదిలా ఉంచితే రిషబ్ పంత్ కి చాలా మంది సీనియర్ క్రికెటర్లు రిషబ్ పంత్ కి అండగా నిలిచారు. అలా అండగా నిలిచిన వారిలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఉన్నారు. పంత్ కి  కొద్ది సమయాన్ని ఇస్తే అతను నిలదొక్కుకోగలడని చాలా మంది విశ్వసించారు. అయితే రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా వీరిద్దరిలో ఎవరు బెస్ట్ వికెట్ కీపర్ అనే చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు సంచలనానికి తెర తీశాయి.


మొన్నటి వరకు రిషబ్ పంత్ కి అండగా నిలిచిన సౌరవ్, అనూహ్యంగా  బెస్ట్ వికెట్ కీపర్ గా సాహా వైపు మొగ్గు చూపాడు. ఈ విషయం పై గంగూలీ ఏమన్నాడంటే, ‘సాహా మా బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన వాడు కాబట్టి ప్రపంచంలోనే అతడే అత్యుత్తమ కీపర్‌. రిషబ్‌ పంత్‌ కూడా కీపర్‌గా విజయవంతం అయినప్పటికీ,  సాహా నే  బెస్ట్‌ కీపర్‌ అని, అతడు ఎక్కువ కాలం క్రికెట్‌ ఆడాలని కెప్టెన్ విరాట్‌ కోహ్లి కూడా కోరుకున్నాడ’ని గంగూలీ పేర్కొన్నాడు. ఇంతకాలం రిషబ్ పంత్ వైపు మొగ్గుచూపిన కోహ్లీ, గంగూలీ మాటలకు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: