విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ గా దిగిన రోహిత్ శర్మ తన అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పటి వరకు పరిమిత ఓవర్లు మాత్రమే ఆడగలడు అనుకున్నవాడు టెస్టుల్లో తానేంటో నిరూపించుకున్నాడు. ఓపెనర్ గా దిగిన మొదటి మ్యాచ్ లో రెండు ఇన్నింగ్సుల్లోనూ రెండు సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. అయితే క్రీడా అభిమానులు. విశ్లేషకులు అతని ఆటను ప్రశంసించారు. 


చాలారోజుల తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ఆటగాడిని చూశామంటూ పొగిడుతున్నారు. అలాగే తర్వాతి మ్యాచ్ లో రోహిత్ ఆట ఎలా ఉంటుందోనన్న చర్చ అధికమవడంతో అతడిపై ఒత్తిడి పెరిగింది. దీంతో రంగంలోకి దిగిన కోహ్లీ క్రీడా విశ్లేషకులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.  కోహ్లీ మాట్లాడుతూ, రోహిత్ మంచి ఆటగాడు. అతడు తనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. పరిమిత ఓవర్లలో తనకున్న అనుభవాన్ని ఉపయోగించి అతడు చాలా జాగ్రత్తగా ఆడాడు.


ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో అతడు దూకుడుగా ఆడడం వల్ల మ్యాచ్ పై మాకు పట్టు దొరికింది. టాపార్డర్ బ్యాట్స్‌మన్‌ రాణింపుపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ఈ విధంగా రోహిత్ లాంటి ఆటగాడు ఓపెనర్ గా ఉండటం జట్టుకు చాలా లాభదాయకం. రోహిత్ నుండి మరిన్ని మంచి ఇన్నింగ్స్ లు ఆశిస్తున్నాం. ముందు ముందు కూడా అతని ఆటతీరు ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాం.


పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఏ విధంగా ఆడతాడో టెస్టుల్లో కూడా అలానే రాణించాలని భావిస్తున్నాం.అయితే చాలా మంది క్రీడా విశ్లేషకులు రోహిత్ ముందు ముందు ఎలా ఆడతాడనే దానిపై రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. దీనివల్ల అతడిపై ఒత్తిడి అధికమవుతుంది. అందువల్ల అతడి ఆటని ఆడనిస్తే మరిన్ని అద్భుతాలు చేయగలడు. అనవసరంగా ఒత్తిడి పెంచవద్దని కోరాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: