టీమిండియా... దక్షిణాఫ్రికా మధ్య ఆసక్తికర టెస్ట్ పోరుకు ప్రారంభం అయంది.ప్రముఖ నగరమైన పుణెలో రెండు జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ టీమిండియా మొదటి టెస్టు గెలిచి... 1-0తో ఆధిక్యంలో ముందు ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్ కూడా గెలిచి... సిరీస్‌ను దక్కించుకోవడానికి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో బరిలో దిగింది. ఇటీవల  వైజాగ్ టెస్టులో రోహిత్ శర్మ సెంచరీలతో కదం తొక్కి... 303 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిస్తే... మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ చేసాడు. ఇక అశ్విన్, మహ్మద్ షమీ, జడేజా, ఇషాంత్ శర్మ... వికెట్ల వేటలోమాత్రం ఒక రేంజ్ లో  ఆడుకున్నారు. 


 వీళ్లంతా సెకండ్ టెస్టులోనూ కూడా అదే జోరుతో ఆడాలని  పట్టుదలతో బరిలోకి దిగారు. సౌతాఫ్రికా మాత్రం రెండో టెస్టును గెలిచి... సిరీస్ సమం చెయ్యాలని ప్రయత్నం చేస్తుంది. టీ-20లో సిరీస్ సమం చేసి... టీమిండియాను నిరాశ పరిచిన సఫారీలు... టెస్టు సిరీస్‌లోనూ అలాగే చెయ్యాలి అనే భావనలో ఉన్నారు.ఇక  మొదటి టెస్టు విజయం సాధించడంతో... భారత జట్టులో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయి. అందువల్ల మన జట్టును ఢీ కొట్టే విషయంలో సఫారీలు ప్రస్తుతం అంత బలంగా లేరనే చెప్పవచ్చు.


ప్రస్తుత మ్యాచ్‌లో అందరి దృష్టీ... రోహిత్ శర్మపై ఒక కన్ను వేశారు. టీ-20లో దుమ్మురేపే ఈ హిట్ మ్యాన్... టెస్టుల్లో ఓపెనర్‌గా ఎలా టాలెంట్ నిరూపించుకుంటాడో అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల  విశాఖ టెస్టులో రోహిత్ శర్మ చెలరేగిపోవడంతో... రెండో టెస్టులోనూ అదే రీతిలో ఆడుతాడు అని అనుకుంటున్నారు.

ఇక పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మొదటి రోజు అదరగొట్టింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(63), అజ్యింకె రహానే(18) పరుగులతో ఉన్నారు. మరి రెండవ రోజు ఎలా ఆడతారో చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: