పూణే వేదికగా  సౌతాఫ్రికా -భారత జట్ల  లమధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సౌతాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో..   ఫీల్డింగ్ చేస్తున్న  రోహిత్ శర్మ కు దగ్గరుకు  భద్రతా వలయాన్ని దాటుకొని  అభిమాని పెరుగెత్తుకుంటూ వచ్చాడు. ఆతరువాత అతను  రోహిత్ పాదాలను తాకడానికి  ప్రయత్నించగా  తప్పించుకునే క్రమంలో రోహిత్ కిందపడ్డాడు.  ఇక  ఆ అభిమాని చేసిన పనికి  స్టేడియం లో వున్న ప్రేక్షకులు షాక్ అయ్యారు.  అయితే ఆ సమయంలో రోహిత్ పక్కనే వున్న అజింక్యా రహానే  నవ్వుకుంటూ  రోహిత్ ను పైకి లేపాడు . ఆతరువాత భద్రతా సిబ్బంది వచ్చి ఆ అభిమానిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. 


గతంలో  ఇలాంటి అనుభవాలు ధోని  , కోహ్లీ కి చాలానే ఎదురైయ్యాయి.  తమ అభిమాన క్రికెటర్లను  కలుసుకోవాలని  ఉత్సాహంతో  వారు చేస్తున్న వల్ల ఇబ్బంది పడుతున్నారు.  అయితే  రోహిత్ కు మైదానం లోపల ఇలా జరగడం ఇదే మొదటిసారి. గత కొన్ని సంవత్సరాలుగా  రోహిత్ విశేషంగా రాణిస్తూ  అభిమానులను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ క్రికెట్ లో ధోని , కోహ్లీ తరువాత  అత్యంత ఆదరణ కలిగిన క్రికెటర్ రోహిత్ శర్మనే. 


ఇదిలాఉంటే  ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీం ఇండియా మ్యాచ్ ను  శాసించే స్థితికి చేరుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 601పరుగులు చేసి డిక్లెర్ చేయగా సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో  275 పరుగులకే కుప్పకూలి ఫాలో ఆన్  ప్రమాదంలో పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: