మైదానం లో  అడుగుపెట్టి తన బ్యాటుతో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించగలడు ... తన దూకుడు స్వభావంతో ప్రత్యర్థి  జట్టుకు  వణికు పుట్టించగలడు. పరుగుల వరద పారిస్తూ  టీమ్ ఇండియా ని విజయ తీరాల వైపు నడిపించగల సత్తా అతని సొంతం. అతనే  డేర్ అండ్ డాషింగ్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. విరాట్ కి ఎన్ని పరుగులు చేసిన పరుగుల దాహం మాత్రం తీరలేదు. అందుకే అభిమానులు ముద్దుగా విరాట్ కోహ్లీni1 పరుగుల యంత్రం అని పిలుచుకుంటారు. ఇక విరాట్ కోహ్లీ అధిగమించని రికార్డు లేదంటే నమ్మండి. దిగ్గజ క్రికెటర్ లను సైతం వెనక్కి నెట్టి ఎన్నో రికార్డులను సాధించిన విరాట్ కోహ్లీ రికార్డుల రారాజుగా పేరొందాడు. 

 

 

 

 

 విరాట్ బాట్ పట్టుకుని మైదానంలోకి అడుగు పెడితే ప్రత్యర్థి బౌలర్లకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే . విరాట్ బ్యాట్ పడితే   మ్యాచ్  స్వరూపమే మారిపోతుంది. ఇక మైదానంలో విరాట్  దూకుడుకి ఫ్రాన్స్ లో ఎనర్జీ వస్తుంది . ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన  టీమిండియా కెప్టెన్ కోహ్లీ... దిగ్గజ క్రికెటర్ లను సైతం వెనక్కి నెట్టి... తన పరుగుల వరద తో ఎన్నో రికార్డులను తిరగ రాశాడు కోహ్లీ. ప్రపంచ మేటి బ్యాట్స్ మెన్ లలో  ఒకడైన కోహ్లీ... నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు. ఇక కోహ్లీ  కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మామూలుగా ఉండదండోయ్... కోహ్లి డేర్ అండ్ డాషింగ్ బ్యాటింగ్ కి మెస్మరైజ్  అయిపోయే అభిమానులు ఎంతో మంది. 

 

 

 

 

 అయితే టెస్టు ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో నిలిచాడు. సౌత్ఆఫ్రికాపై జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో 256 పరుగులతో  విరాట్ కోహ్లీ చెలరేగాడు. కాగా  కోహ్లీకి టెస్ట్ ర్యాంకింగ్ లో 936 పాయింట్లు రాగా ... ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ స్టీవ్  స్మిత్  కి 937 పాయింట్లు వచ్చాయి. దీంతో టెస్ట్ ర్యాంకింగ్ లో  మొదటి స్థానంలో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్  ఉండగా... రెండవ స్థానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. అయితే ఇంకో మ్యాచ్ మిగిలి ఉండడంతో ఆ మ్యాచ్ లో  కోహ్లీకి భారీ స్కోరు చేస్తే మొదటి స్థానం లోకి పాకే అవకాశం ఉంది. కాగా టీమిండియా స్టార్ బౌలర్  బూమ్రా ఎప్పటిలాగే మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక అశ్విన్, మయాంక్  అగర్వాల్ లు  7,  17వ స్థానాల్లో  నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: