సూపర్ ఓవర్ వివాదానికి ముగింపు పలికింది ఐసీసీ. ఫైనల్స్‌లో సూపర్ ఓవర్ టైగా మారితే బౌండరీ లెక్కతో విజేతను నిర్ణయించే విధానానికి గుడ్‌బై చెప్పింది. విజేత ఎవరో తేలేవరకూ సూపర్ ఓవర్లు ఆడించాలని నిర్ణయించింది. ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ మధ్య దుమారం రేగడంతో... వివాదాస్పద నిబంధనను తొలగించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.  


కొన్ని రూల్స్ విజయావకాశాలను దెబ్బతీస్తాయి... విజేతలను తారుమారు చేస్తాయి. అలాంటి నిబంధనల కారణంగానే ఇటీవల వరల్డ్ కప్ టైటి్ల్‌ను చేజార్చుకుంది న్యూజిలాండ్. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ టైగా ముగిసింది. దీంతో నిబంధనల ప్రకారం రెండు జట్ల మధ్య సూపర్ ఓవర్ ఆడించారు. అయితే సూపర్ ఓవర్ లో కూడా రెండు జట్లు సమానంగా స్కోర్ సాధించాయి. దీంతో ఎక్కువ బౌండరీలు ఆడిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. సూపర్‌గా ఆడిన న్యూజిలాండ్ కంటే... బౌండరీల లక్కుతో కప్పు కైవసం చేసుకుంది ఇంగ్లండ్.  


ఈ తరహా ఐసీసీ నిబంధనలపై పెద్ద దుమారమే రేగింది. అభిమానుల నుంచి క్రికెటర్ల వరకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సూపర్ ఓవర్ నిబంధనలపై అధ్యయనం చేయడానికి అనీల్ కుంబ్లే నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది ఐసీసీ. కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ... సూపర్ ఓవర్ నిబంధనల్లో ఐసీసీ మార్పులు చేసింది. ఇకపై మ్యాచ్ టై అయితే... బౌండరీల ద్వారా విజేతను నిర్ణయించరు.  


ఫైనల్‌లో ఫలితం తేలే వరకూ సూపర్ ఓవర్లు ఆడాల్సిందే. ఒక వేళ సూపర్ ఓవర్‌లో స్కోర్ సమానంగా వస్తే... మళ్లీ ఇంకో సూపర్ ఓవర్ ఆడాల్సిందే. ఫైనల్స్, సెమీ ఫైనల్స్ లో ఇకపై మార్చిన నిబంధన ప్రకారమే...విజేతను డిసైడ్ చేస్తారు. దుబాయ్‌లో జరిగిన ఐసీసీ క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు..స్పాట్ 

మరింత సమాచారం తెలుసుకోండి: