ఐసీసీ టోర్నీల్లో భారత్ జట్టు ప్రదర్శనపై నూతన బీసీసీఐ అధ్యక్షుడు , భారత్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు . ఐసీసీ టోర్నీల్లో మరింత మెరుగైన ప్రదర్శన అవసరమని దాదా అన్నాడు . ఇండియా టీమ్ ప్రస్తుతం పటిష్టంగా ఉందని , అయితే ఐసీసీ టోర్నీల్లో సెమీస్, ఫైనల్స్ లో బోల్తా పడుతుండడం ఆందోళన కలిగించే విషయమని చెప్పాడు .


 కెప్టెన్ విరాట్ ఓ ఛాంపియన్ . అతని సారధ్యం లో మరింత మెరుగ్గా రాణించి విజయాల్ని సొంతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు . 2013  ధోని సారధ్యం లో  ఐసీసీ టోర్నీ గెల్చిన తరువాత , భారత్ జట్టు ఐసీసీ టోర్నీ గెల్చుకున్న దాఖలాలు లేవు . 2016 లో జరిగిన వరల్డ్ టీ -20  క్రికెట్  టోర్నీ లో, 2017 లో జరిగిన ఛాంపియన్స్ క్రికెట్ టోర్నీ , 2019 లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ లో  భారత్ జట్టు నాకౌట్ దశలోనే వెనుతిరగడాన్ని గంగూలీ , పరోక్షంగా ప్రస్తావిస్తూ జట్టు ఆటతీరు మరింత మెరుగుపడాల్సిందేనని చెప్పకనే చెప్పాడు . ప్రస్తుతం టీమిండియా స్వదేశం , విదేశీ సిరీస్ లలో మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ ఐసీసీ టోర్నీల్లో వైఫల్యం ను అధిగమించాలన్న గంగూలీ సూచన సహేతుకమైనదేనని క్రీడా పండితులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు .


 కీలక టోర్నీల్లో కీలక మ్యాచ్ లలో భారత్ జట్టు ఆటగాళ్ళు  ఒత్తిడి తో చేతులెత్తేస్తున్నారని , ప్రపంచ కప్ లో మాంచెస్టర్ వేదిక న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ ను ప్రస్తావిస్తున్నారు . ఒకరి తరువాత ఒకరు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు వెనుతిరగగా , లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు జట్టును విజయపథం లో నడిపించలేపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: