అందరిలాగే  మైదానం లో  నాకు కోపం , చిరాకు , అసహనం  వస్తాయని కానీ నేను వాటిని అందరికంటే బాగా నియత్రించుకోగలను  అని  అన్నాడు  టీమిండియా మాజీ సారథి , మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని.   మాస్టర్ కార్డ్   ప్రమోషన్  సందర్బంగా  మీడియాలో సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశాడు ధోని.  నేను అందరిలాంటి వాడినే నాకు మైదానం లో కోపం చిరాకు వస్తాయి  కానీ  నేను ఆ భావోద్వేగాలను నియంత్రించుకొని మ్యాచ్  మీద ద్రుష్టి పెడతాను. తరువాతి ఓవర్ లో ఎవరిని బరిలోకి దించాలి  జట్టును ముందుండి ఎలా నడిపించాలి అలా వాటి గురించి  అలోచించి భావోద్వేగాల ను  అదుపులో పెట్టుకుంటానని   ధోని అన్నాడు. 



అలాగే  ఫార్మట్ లకు అనుగుణంగా  నిర్ణయాలు తీసుకోవాలని ధోని పేర్కొన్నాడు.  టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్ లు ఉంటాయి కాబట్టి  నిర్ణయాలు తీసుకోవడానికి చాలా సమయం ఉంటుంది కానీ పరిమిత ఓవర్ల క్రికెట్ లో అలా కాదు ఏ నిర్ణయమైన క్షణాల్లో తీసుకోవాలి  కొని సార్లు ఆ నిర్ణయాలు  సత్పలితాలు ఇవ్వక్కపోవచ్చునని  అని ధోని అన్నాడు.  ఇక  ప్రపంచ కప్ తరువాత ధోని తాత్కాలికంగా ఆటకు విరామం ఇచ్చాడు. అందులో భాగంగా  ఇటీవల వెస్టిండీస్ పర్యటనుండి వైదొలిగిన ధోని .. తాజాగా దక్షిణాఫ్రికా తో  జరిగిన టీ 20 సిరీస్ నుండి కూడా తప్పుకున్నాడు. అలాగే రానున్న బంగ్లాదేశ్ సిరీస్ కు కూడా ధోని అందుబాటులో వుండకపోవచ్చుననితెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈనెల 24న సెలెక్టర్ల తో జరుగనున్న సమావేశంలో  ధోని భవితవ్యంపై  చర్చిస్తామని  నూతన  బీసీసిఐ అధ్యక్షుడు  గంగూలీ అన్నాడు.  




మరింత సమాచారం తెలుసుకోండి: