గాయం కారణంగా నవంబర్ 21 నుండి పాకిస్థాన్‌తో జరుగనున్న రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌కు మార్ష్‌ దూరమయ్యాడు. తాజాగా మార్ష్‌ తన గాయంపై స్పందించాడు.  గత 18 నెలల నుంచి జాతీయ జట్టులో చోటు కోసం ప్రయత్నించా. యాషెస్‌ సిరీస్‌లో అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నా. తీవ్ర నిరాశకు గురైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ డ్రెస్సింగ్ రూమ్ గోడకు పంచ్‌ ఇచ్చి తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ నన్ను ఒక ఇడియట్‌ అని తిట్టాడు.  నా సొంత తప్పిదం ఇప్పుడు నన్ను జట్టుకు దూరం చేసింది. నా సొంత తప్పిదం ఇప్పుడు నన్ను జట్టుకు దూరం చేసిందన్నారు.

   అసలు ఏం జరిగిందంటే ....యాషెష్ అనంతరం మిచెల్‌ మార్ష్‌ షెఫిల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో ఆడాడు. ఈ టోర్నీలో భాగంగా వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా ఉన్న మిచెల్‌ మార్ష్‌, పెర్త్‌లో తస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం జాక్సన్‌ బర్డ్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి నిరాశగా పెవిలియన్‌ చేరాడు. అయితే మ్యాచ్ డ్రాగా ముగియడంతో నిరాశ చెందిన మార్ష్‌, తన కుడి చేతిని డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న గోడకు బలంగా కొట్టాడు.

అనంతరం గాయంతో విలవిల్లాడాడు. జట్టు యాజమాన్యం ఆస‍్పత్రికి తీసుకెళ్లి వెంటనే చికిత్స అందించారు. మార్ష్ కుడి చేతికి స్కానింగ్‌ తీయగా, మణికట్టు చిట్లినట్లు వైద్యులు తెలిపారు. కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని వైద్యులు జట్టు యాజమాన్యానికి సూచించారు. ప్రస్తుతం క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంపిక చేయబోయే జాబితాలో ఆల్‌రౌండర్‌ కోటాలో మార్ష్‌ పేరు ముందే ఉన్నా. అతను చేసుకున్న గాయంతో ఆటకు దూరమై మూల్యం చెల్లించుకున్నాడు మార్ష్‌. 


తాజాగా మార్ష్‌ తన గాయంపై స్పందించాడు. మార్ష్‌ మాట్లాడుతూ... 'ఇది దురదృష్టకరమైన ఘటన. ఇలాంటి ఘటన మళ్లీ జరగదని, ఈ గాయం నాకు ఒక గుణపాఠం నేర్పిందని. మిగతావారికి కూడా ఇదొక పాఠమే అని అనుకుంటున్నా అని అన్నారు.. నేను చేసుకున్న తప్పిదంతో మణికట్టు వద్ద చిట్లింది. నా మధ్య వేలి కింది భాగంలో పగుళ్లు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో గెలుస్తుంటాం, ఒడుతుంటాం. కానీ గోడకు పంచ్‌లు ఇవ్వొదు' అని అన్నాడు. నేను ఇలా గాయం చేసుకోవడంతో కోచ్ నిరుత్సాహపడ్డాడు. నేను క్షమాపణలు చెప్పడం తప్ప చేసేదేమీ లేదు' అని మార్ష్‌ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: