ప్రకాశం జిల్లా లో క్రికెట్ కి సంబంధించి ఎన్నో మోసాలు జరుగుతున్నాయి.అసలు ప్రాంతం నుండి ఎందుకు క్రికెటర్స్ రావడం లేదు అని కొందరు గుస గుస లాడుకుంటుంటే మరికొందరు మాత్రం ఒక వేళ ఆ ప్రాంతం నుండి వచ్చిన రికమండేషన్ ప్లేయర్స్ అవ్వడం వల్ల సరిగ్గా ఆడక అందరిలో పరువు కూడా తీసేస్తున్నారు అంటూ అక్కడి కసి తో కూడిన ప్లేయర్స్ వారి బాధలను చెప్పుకుంటున్నారు.ఇది ఇలా ఉంటే ప్రకాశం జిల్లా క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ మాత్రం ఎన్నో ఏళ్ల నుండి ఒక్కడే ఉండటం వల్ల వారు బాగా మోసాలకు,అవినీతికి పాల్పడుతున్నాడు అని కూడా అక్కడి ప్రజానికం చెప్పుకుంటున్నారు.

కసి తో రేగి పోతున్న ప్లేయర్స్ మాత్రం వారికి అవకాశం ఇవ్వకుండా డబ్బున్న వారికి రికమండేషన్ ఉన్న వారికే ఇచ్చి మాలో ఉన్న ఆటను జిల్లా స్థాయిలోనే చంపేస్తుంటే ఇంకా దేశ,ప్రపంచ స్థాయిలో ఎలా ఆటగాళ్లు తయారవుతారు అంటూ కూడా చాలా ఎమోషన్ అయిపోతున్నారు.

దేశం లో అవినీతిని అంతమొందిస్తా అని ఎందరో నాయకులు హామీలు ఇస్తున్నారు,పోతున్నారు తప్ప నిజం గా అవినీతి నిర్ములనా జరగడం లేదని కూడా ప్లేయర్స్ వారి బాధను వెళ్ళ బుచ్చుతున్నారు.

జిల్లా క్రికెట్ సంఘ సభ్యులు,నాయకులు మాత్రం ఇక్కడ అవినీతి,అన్యాయం లాంటివి జరగడం లేదని తమని ఎదుర్కోలేకనే ఇలా ఆరోపణలు చేస్తున్నారని తమ పని తాము చేసుకుంటున్నాం తప్ప మేము ఊరికే వార్తల్లోకి ఎక్కడం తమకి ఇష్టం లేదని అందుకే ఇలాంటి వార్తలకు తాము రియాక్ట్ కాలేదని వారు పేర్కొంటున్నారు.ఏదేమైనా ఇలాంటి ఆరోపణలు వచ్చేలా జిల్లా  వ్యవరించింది అంటే అంతో ఇంతో పొగ లేనిదే నిప్పు రాజేసుకోదు కాబట్టి దీన్ని అధికారులు గవర్నమెంట్ పట్టించుకోని జిల్లా క్రికెట్ సంఘాన్ని దాని పాలక విధానాన్ని పూర్తిగా మార్చేసి మునుపటి వైభోగం తీసుకొస్తారని ఆశిద్దాం....

మరింత సమాచారం తెలుసుకోండి: