ఎన్నో ఏళ్లు భారత జట్టులో  సేవలందించి... భారత క్రికెట్ పేరు ప్రపంచం  నలుమూలలా వ్యాపింపజేసిన క్రికెట్ దిగ్గజం గంగూలీ  బిసిసిఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనుండడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ  అధ్యక్ష పదవికి క్రికెట్ దిగ్గజం గంగూలీ  సమర్థవంతమైన వ్యక్తి అని అందరూ భావిస్తున్నారు. బీసీసీఐ  అధ్యక్షుడిగా గంగూలీ  బాధ్యతలు స్వీకరించడంతొ  భారత క్రికెట్ ఇంకా  పరిణితి చెందుతుంది అని భావిస్తున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు  అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు స్వీకరించక ముందే  ఆయన ప్రాబల్యం విస్తరిస్తోంది. భారత క్రికెట్ లోని అన్ని వర్గాలు ఆయనకు మద్దతు తెలువుతుండగా... మరోవైపు క్రికెట్ అభిమానులు కూడా.... ఆయన బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు . 

 

 

 

 

 మైదానంలో దూకుడుగా వ్యవహరించే గంగూలీ  రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ వ్యవహారాలలో  పరిణితితో కూడిన పాలనాదక్షత  కనబరుస్తున్నారు. అయితే తాజాగా ఎవ్వరూ ఊహించని విధంగా బిసిసిఐ అధ్యక్షుడిగా గంగూలీ  బాధ్యతలు స్వీకరిస్తుండగా  ఆయన సామర్థ్యంపై అందరికీ పూర్తి నమ్మకం ఉంది. బిసిసిఐ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించి బిసిసిఐ ఖ్యాతిని  పెంచే విధంగా గంగూలీ  వ్యవహరిస్తాడని అందరు నమ్ముతున్నారు. అయితే భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం అదే మాట అంటున్నారు. ఒక గొప్ప వ్యక్తి ప్రస్థానం బిసిసిఐ అధ్యక్షుడిగా మరింత గొప్పగా ఉండబోతుందని అభిప్రాయపడ్డాడు. 

 

 

 

 

 అయితే కొన్నాళ్ల కిందట భారత క్రికెట్లో యోయో టెస్ట్  ప్రవేశపెట్టినప్పుడు... బిసిసిఐ అధ్యక్షుడిగా గంగోలి వచ్చి ఉంటే బాగుండేది అని... ఎందుకంటే యోయో టెస్ట్ పై ఆటగాళ్ల  దృక్కోణం గురించి ఆలోచించిగల వ్యక్తిగా గంగూలీ  సరైన నిర్ణయం తీసుకుని ఉండేవాడిని పేర్కొన్నారు మాజీ క్రికెటర్ సిక్సుల వీరుడు  యువరాజ్ సింగ్ . కాగా బీసీసీఐ  నూతన అధ్యక్షుడిగా సరికొత్త పదవి చేపడుతున్న సందర్భంగా... దాదా గా పిలుచుకునే గంగూలీకి  యువరాజ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: