మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత పేసర్ ఉమేష్ యాదవ్ బ్యాట్‌ ఝుళిపించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్ల మోత మోగించాడు.రవీంద్ర జడేజా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఉమేశ్‌ యాదవ్‌.. వచ్చీ రావడంతోనే పరుగుల వరద పారించాడు. ఉమేష్ కేవలం 10 బంతుల్లోనే 31 పరుగులు చేసాడు. ఇందులో 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఐదు సిక్సర్లు స్పిన్నర్‌ లిండే బౌలింగ్‌లోనే బాదడం విశేషం.ఇదే ఊపులో మరో భారీ షాట్‌ కొట్టబోయి.. ఆ ఓవర్‌ చివరి బంతికి ఔటయ్యాడు. బంతి గాల్లోకి లేవగా కీపర్ సునాయాస క్యాచ్ అందుకోవడంతో ఉమేష్ చిరునవ్వులు చిందిస్తూ పెవిలియన్ చేరాడు.


ఇక ఉమేశ్‌ ఔట్ అయి డ్రెస్సింగ్‌ రూంలోకి రాగానే కోహ్లీ అతని చూస్తూ వావ్ అంటూ అభినందించాడు. కోహ్లీతో పాటు ఆటగాళ్లు, సిబ్బంది అతన్ని మెచ్చుకున్నారు. దీనికి సంబందించిన వీడియోను బీసీసీఐ తన వీడియోలలో పోస్ట్ చేసింది.ఇంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ 30 పరుగుల్ని 10 బంతుల్లో సాధించాడు. ఇక టెస్టు ఫార్మాట్‌ చరిత్రలో 10 బంతులు, ఆపై ఆడి అత్యధిక స్ట్రైక్‌రేట్‌ కల్గిన ఆటగాళ్లలో టాప్‌లో చోటు దక్కించుకున్నాడు. ఉమేశ్‌ యాదవ్‌ 310 స్టైక్‌రేట్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు.

అంతేకాదు, ఉమేశ్‌ యాదవ్ సిక్సర్ల మోతను చూసి డ్రెస్సింగ్‌ రూంలో ఉన్న కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా నవ్వులు పూయించారు. ముఖ్యంగా కోహ్లీ చిందులు వేసాడు. ఉమేశ్‌ సిక్సర్ కొట్టిన ప్రతిసారి డ్రెస్సింగ్‌ రూం సహచరులతో ఆనందాన్ని పంచుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: