మన దేశంలో క్రికెట్ అంటే అందరికీ ఎంత  పిచ్చి ఉంటుందో  అందరికి తెలిసిన విషయమె.  క్రికెట్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు క్రికెట్ ప్రేక్షకులు. ఇక టీమిండియా ఆటగాళ్లు సిక్సులు లో ఫోర్ లు కొడుతుంటే... టీవీ ముందు కూర్చొని  ఎంజాయ్ చేస్తుంటారు. ఇక క్రికెట్ ఆటగాళ్లని  అయితే విపరీతంగా  అభిమానిస్తుంటారు . ఇక మన దేశంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. మామూలుగానే క్రికెట్ అభిమానులందరికి  ఇండియా క్రికెట్ మ్యాచ్ అంటేనే ఓ రేంజ్ లో సందడి ఉంటుంది... ఇక ఐపీఎల్ అయితే ఆ సందడి కాస్త డబుల్ త్రిబుల్ అవుతుంది. ఇండియా టీం లో అయితే ఒకటే  కెప్టెన్ ఒక వైస్ కెప్టెన్. కానీ ఐపీఎల్ లో మాత్రం ఇండియా జట్టులోని  ప్రతి ఒక్క ఆటగాడు  ఒక్కో  జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తుంటారు. తమ అభిమాన ఆటగాడు జట్టును ముందుండి నడిపిస్తున్న విజయ తీరాలకు చేరుస్తుంటే  ఇక క్రికెట్ అభిమానులకు అంతకంటే ఇంకేం కావాలి. 

 

 

 

 

 అందుకే ఐపీఎల్ మొదలైందంటే దేశంలో క్రికెట్ అభిమానుల సందడి రెట్టింపవుతుంది. ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్ మ్యాచ్ల కోసం క్రికెట్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇక్కడ మన ఆటగాళ్ల తీరే కాదు విదేశీ ఆటగాళ్లు సైతం... తనకు నచ్చిన టీం  లో ఆడుతున్న డంతో ఇక ఆ మజానే వేరు ఉంటుంది. అయితే ఐపీఎల్ మొదలైందంటే రోజుకు రెండు మ్యాచ్ లు  క్రికెట్ అభిమానులను అలరిస్తుంటాయి.  కానీ వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి కొత్త నిబంధనలతో సరికొత్తగా ఐపీల్  నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తుందట . 

 

 

 

 

 ఇప్పటివరకు వీకెండ్ రోజుల్లో రెండు మ్యాచ్ లు  నిర్వహించేది బిసిసిఐ. కానీ ఇక మీదట ప్రతిరోజు ఓకే మ్యాచ్  అది కూడా రాత్రివేళల్లో నిర్వహించాలని బిసిసిఐ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ విధంగా ఐపీఎల్ నిడివి కూడా రెండు నెలలకు పొడిగించాలని  ఓ ప్రతిపాదన సిద్ధం చేశారట అధికారులు . అయితే త్వరలో జరగబోయే బిసిసిఐ పాలకమండలి సమావేశంలో ఈ కొత్త ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడుతుందని భావిస్తున్నారు. ఐపీఎల్ ప్రేక్షకులకు ఇదొక చేదువార్త అనే చెప్పాలి. ఎందుకంటే రోజు రెండు మ్యాచ్ ల తో ప్రేక్షకులను అలరించే  ఐపీఎల్ ప్రస్తుతం ఒకే మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ  ప్రతిపాదన సిద్ధం చేయటంతో  ... క్రికెట్ ప్రేక్షకులకు కాస్త మజా తగ్గనుందని  చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: