మూడు మ్యాచ్ ల టెస్ట్  సిరీస్ లో భాగంగా   రాంచి వేదికగా  సౌతాఫ్రికా తో  జరిగిన  చివరి టెస్ట్ లో  టీమిండియా  202 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో  ఘనవిజయం సాధించి  మొదటి సారి  దక్షిణాఫ్రికా పై టెస్టుల్లో  క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది.  ఈవిజయం తో  భారత్  అటు టెస్టుల్లో  నెంబర్ 1 ర్యాంక్ తోపాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో మొదటి స్థానాన్ని పదిలం చేసుకుంది.   రాంచి టెస్ట్  నాలుగో రోజు  మ్యాచ్  కు భారత మాజీ సారథి , లోకల్ బాయ్  ధోని  కూడా  హాజరైయ్యాడు.  ఇక గెలుపు  అనంతరం  కోహ్లీ మీడియా సమావేశంలో  పాల్గొనగా   ఈ సందర్భంగా  కోహ్లీ  కి  ఓ విలేకరి  ధోని ఫ్యూచర్ గురించి  ఓ ప్రశ్న వేయగా  దానికి  కోహ్లీ  వంగ్యంగా  జవాబిచ్చి  అక్కడ ఉన్న వారందరిని నవ్వించాడు. 




ధోని  ఇక్కడే  చేంజ్ రూమ్ లో వున్నాడు వచ్చి అతని హాయ్ చెప్పండి అని సమాధానమిచ్చాడు.  ఇదిలా ఉంటే  ప్రపంచ కప్ తరువాత ధోని  క్రికెట్ కు  తాత్కాలికంగా  విరామం పలికాడు. అందులో భాగంగా  వెస్టిండీస్ పర్యటనకు దూరమైన  ధోని ..తాజాగా జరిగిన  సౌతాఫ్రికా పర్యటనుండి  కూడా   వైదొలిగాడు.  రానున్న బంగ్లాదేశ్  తో సిరీస్  కు కూడా  ధోని   జట్టు తో చేరడం తో అనుమానంగానే మారింది. ఈనేపథ్యంలో  నూతన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ  ఈనెల 24 న సెలెక్టర్ల తో సమావేశం అయ్యి అతని   భవితవ్యం పై ఓ నిర్ణయానికి రానున్నారు.   ఆతరువాత గంగూలీ , ధోనితో కూడ  సమావేశం కానున్నాడని  తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: