రికార్డుల రారాజు , టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తాజాగా జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్‌ ద్వారా కెప్టెన్ గా  మరి కొన్ని  రికార్డులు సృష్టించాడు.   విరాట్ ఇప్పటివరకు స్వదేశంలో 24 టెస్టులకు సారథ్యం వహించగా అందులో ఇండియా 18 మ్యాచ్ ల్లో గెలిచి  5 మ్యాచ్ లను  డ్రా చేసుకొని కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో ఓడిపోయింది.  అలాగే  దక్షిణాఫ్రికాపై కోహ్లి కెప్టెన్సీ లో భారత్‌ 10 టెస్టులు ఆడగా అందులో ఏడు విజయాల్ని నమోదు చేసింది. దాంతో సఫారీలపై కోహ్లి విజయాల శాతం 70గా నమోదైంది.  ఈ విషయంలోకోహ్లీ , మిగితా భారత కెప్టెన్లకు అందనంత ఎత్తులో నిలిచాడు . మిగతా అంతా కలిసి సఫారీలపై 29 టెస్టులు ఆడగా విజయాల శాతం 24.14 గా ఉంది. దాంతోపాటు గా  భారత క్రికెట్ చరిత్రలో  సౌతాఫ్రికా ను టెస్ట్ సిరీస్ లో  వైట్ వాష్ చేయడం కూడా ఇదే  మొదటిసారి. అది కూడా కోహ్లీ నేతృత్వం లోనే జరగడం విశేషం. 



ఇక  వీటితో పాటు టీమిండియా ను  ఇన్నింగ్స్ తేడాతో అత్యధిక  టెస్ట్ లు గెలిపించిన  భారత్ కెప్టెన్ గా కోహ్లీ  , ధోని సరసన నిలిచాడు.  ఇంతకుముందు భారత్..  ధోని కెప్టెన్సీ లో 9 సార్లు  ఇన్నింగ్స్ తేడాతో గెలువగా రాంచి టెస్ట్ తో తాజాగా కోహ్లీ సారథ్యంలో కూడా  అదే తరహాలో 9 సార్లు విజయాల  సాధించింది.  అలాగే  మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇప్పటివరకు  మూడు సార్లు ప్రత్యర్థి జట్లను  వైట్ వాష్ చేసిన  భారత కెప్టెన్ గా  కోహ్లీ రికార్డు సృష్టించాడు. అందులో భాగంగా 2016లో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్  3-0 తో క్లీన్ స్వీప్ చేయగా  2017లో  శ్రీలంక పై , తాజాగా 2019 లో సౌతాఫ్రికా ను వైట్ వాష్ చేసింది.  ఇక  ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్స్ లో కోహ్లీ  నెంబర్ 2 స్థానం లో కొనసాగుతుండగా గత రెండేళ్ల నుండి  అతను వన్డే ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానంలో కొనసాగుతూ సరిలేరు నీకెవ్వరు అని అనిపించుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: