బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలి  బాధ్యతలు చేపట్టడం పట్ల క్రికెట్ వర్గాలన్నీ సంతృప్తి చెందాయి. బీసీసీఐ  ప్రధాన కార్యాలయంలో జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో గంగూలి  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, అయితే బిసిసిఐ  అధ్యక్ష పదవికి గంగూలీ మినహా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో బిసిసిఐ అధ్యక్ష పదవి ఆయనను  వరించింది. అయితే ఇప్పటి వరకు బీసీసీఐ బాధ్యతలను  ముప్పై మూడు నెలల పాటు  సుప్రీంకోర్టు నియమించిన  పాలకుల కమిటీ నడిపించింది. అయితే ఈ కమిటీ తప్పుకోవడంతో ప్రస్తుతం బీసీసీఐ  39వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు గంగూలీ . 



 అయితే బిసిసిఐ అధ్యక్షుడిగా గంగూలి  నియమితులు కావడం తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా  కార్యదర్శిగా,  అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ సింగ్  కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఒక మాజీ క్రికెటర్ బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం 65 ఏళ్ల చరిత్రలోనే బీసీసీఐ చరిత్రలోనే మొదటిసారి. 65 ఏళ్ల క్రితం భారత మాజీ కెప్టెన్ అయిన విజయనగరం మహారాజు విజయానంద గజపతిరాజు బీసీసీఐ  అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక 2004లో సునీల్ గవాస్కర్, శివలాల్ యాదవ్ బీసీసీఐ అధ్యక్ష పదవి బాధ్యతలు  నిర్వహించినప్పటికీ... వాళ్లు తాత్కాలిక వీధుల్లోనే మాత్రమే ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో బీసీసీఐ  పగ్గాలు చేపట్టిన గంగూలీ  మరో పది నెలలు బీసీసీఐ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు . ఎందుకంటే గత 4 ఏళ్ళ నుండి బీసీసీఐ  క్రికెట్ పాలనా వ్యవహారాలు గంగూలి  పాలుపంచుకుంటుండడంతో ... లోధా కమిటీ నిబంధన ప్రకారం జూలైలో ఆయన పదవి కాలం ముగియనుంది . మళ్లీ మూడేళ్ల తర్వాత పదవికి గంగూలీ బీసీసీఐ అధ్యక్ష 
పదవికి  పోటీ చేయడానికి అవకాశం ఉంది.



 అయితే బీసీసీఐ అధ్యక్షుడిగా క్రికెట్ దిగ్గజం గంగూలి నియమితులు అవడంతో ఆయనకి క్రికెట్ లోని అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. బిసిసిఐ అధ్యక్ష పదవికి గంగూలి సమర్థవంతుడైన వ్యక్తి అని అందరూ భావిస్తున్నారు. గంగూలి బిసిసీఐ అధ్యక్షుడిగా నియమితులై బిసిసిఐ ఖ్యాతిని గంగూలీ  మరింత పెంచుతారని భావిస్తున్నారు. అంతే కాకుండా ఒక గొప్ప వ్యక్తికి మరో ఉన్నతమైన ప్రస్థానం మొదలైంది కొంత మంది క్రికెటర్లు భావిస్తున్నారు. అయితే తాజాగా బిసి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన గంగూలి... బీసీసీఐ లో  ఎలాంటి మార్పులు తీసుకు వస్తారు చూడాలి మరి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: