ఇప్పుడు టీం ఇండియా అంటే ప్రపంచంలో ఒక గొప్ప టీమ్ గా గుర్తింపు వచ్చింది.  ప్రస్తుతం టీం ఇండియాకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్నారు.  ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సీరీస్ ను 3-0 తో కైవసం చేసుకుంది.  ఈ మూడు టెస్ట్ మ్యాచ్ లలో ఎన్నో రికార్డులు వరించాయి.  ఇక ఇదిలా ఉంటె, ప్రస్తుతం బిసిసిఐ చీఫ్ గా సౌరవ్ గంగూలీ పదవీబాధ్యతలు చేపట్టారు.  13 నెలలపాటు అయన ఈ పదవిలో ఉంటారు.  


ఒక క్రికెటర్ ఇలా బిసిసిఐ చీఫ్ గా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి.  ప్రపంచంలోనే బిసిసిఐ అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డు.  ఈ బోర్డు ఆధ్వర్యంలోనే ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి.  ఐపీఎల్ వచ్చాక బోర్డు కు భారీ ఆదాయం వస్తోంది.  ఒకప్పుడు టీమ్ ఇండియా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నది.  మహ్మద్ అజారుద్దీన్ సమయంలో ఇలా జరిగింది.  ఆ సమయంలో ఇండియా పరిస్థితి దారుణంగా ఉండేది.  చిన్న చిన్న టీమ్ లపై కూడా ఓటమిపాలయ్యేది.  ఉపఖండంలో మాత్రమే ఇండియా గెలుస్తుందని, విదేశాల్లో టీమ్ ఇండియాకు సరైన ట్రాక్ రికార్డ్ లేదని వార్తలు వచ్చేవి.  


కానీ, ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.  టీం ఇండియా లీడింగ్ పొజిషన్లో ఉన్నది.  ఇప్పుడు టీం ఇండియా ఈ స్థాయిలో నిలబడింది అంటే దానికి కారణం దాదానే.  సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత.. మ్యాచ్ లలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకున్నారు.  జట్టులో యువకులను ప్రోత్సహించారు.  సెహ్వాగ్, గంబీర్, పఠాన్, భువి, ధోని వంటి ఎందరో యువ క్రికెటర్లు గంగూలీ నాయకత్వంలో క్రికెట్ జట్టులోకి వచ్చిన వ్యక్తులే.  గంగూలీ తన నాయత్వంలో టీం ను ఉన్నతంగా తీర్చి దిద్ధేందుకు బీజం వేశారు.  దానిని ధోని కొనసాగించారు.  ఇప్పుడు దాన్ని విరాట్ కోహ్లీ మరింత ముందుకు తీసుకెళ్తున్నారు.  


ఇప్పుడు బిసిసిఐ పరిస్థితి కూడా అలానే ఉన్నది.  క్రికెట్ మ్యాచ్ అంటే మైదానంలోకి వెళ్లిన తరువాత అట ఎలా ఆడాలి అన్నది జట్టు కెప్టెన్ చేతిలో ఉంటుంది.  కాబట్టి ఆ మూడు నాలుగు గంటలు టీమ్ లో స్పిరిట్ నింపాలి.  కానీ, బిసిసిఐ పదవి ఆలా కాదు.  ఇందులో అనేకరంగాలకు చెందిన వ్యక్తులు ఉంటారు.  రాజకీయాలు ఉంటాయి.  వ్యాపారవేత్తలు ఉంటారు.  దేశంలోని వివిధ రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తులు ఉంటారు.  వారందరిని కలుపుకొని పోవాలి.  అందరితో వ్యవహరించే తీరును బట్టి బోర్డు కార్యకలాపాలు ఉంటాయి.  మరి గంగూలీ అలా మ్యానేజ్ చేస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: