బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా  టీమిండియా మాజీ సారథి  సౌరవ్ గంగూలీ  నిన్న బాధ్యతలు చేప్పట్టాడు . ఇంతకుముందు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కు  అధ్యక్షుడిగా   ఉండండం తో  గంగూలీ  కేవలం 9 నెలల పాటే బోర్డు అధ్యక్షడి  పదవిలో ఉండనున్నాడు. ఇక బాధ్యతలు స్వీకరించిన  అనంతరం మీడియా సమావేశంలో  పాల్గొన్న  గంగూలీ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్  గా వున్నపుడు  జట్టును ఎలా నడిపించానో బీసీసీఐ ను అలాగే  నడిపిస్తాను . అవినీతి పాలనా అందించిండమే లక్ష్యం గా  పనిచేస్తాం.  అలాగే టీమిండియా కెప్టెన్ కోహ్లీ కి  పూర్తిగా సహకరిస్తాను నా వల్లతన పని  ఇంకా  సులభం అవుతుంది అన్న దాదా పనిలో పనిగా ధోని కూడా  గురించి   స్పందించాడు.  





ధోని లాంటి క్రికెటర్ భారత జట్టు కు దొరకడం  గొప్ప వరం. భవిష్యత్తు పై ధోని మనుసులో  ఏముందో తెలియదు.  నన్ను జట్టునుండి తప్పించినప్పుడు  నేను మళ్ళీ జట్టులోకి రాననుకున్నారు. కానీ ఆతరువాత నాలుగేళ్లు  టీం లో కొనసాగా.. ఛాంపియన్లు  కెరీర్ ను త్వరగా ముగించాలనుకోరు.  ధోని ఓ ఛాంపియన్ .. అతనిపై ప్రస్తుతం  బోర్డు నుండి ఎలాంటి ఒత్తిడి లేదు.  త్వరలోనే అతడి తో సమావేశమై  ధోని మనుసులో ఏముందో తెలుసుకుంటాను అని గంగూలీ అన్నాడు.  అయితే  బోర్డు అధ్యక్షుడిగా గంగూలీ ముందు  పెద్ద సవాళ్ళే వున్నాయి.  గాడి తప్పిన  బోర్డు పాలన ను తిరిగి  గాడిలో పడేయడం  అలాగే ఐసీసీ లో బోర్డు ప్రాముఖ్యతను పెంచడం ,ఫస్ట్ క్లాస్ క్రికెట్ ను బలోపేతం చేయడం..  ఇవ్వని కేవలం 9నెలలో  చేయడంశక్తికి మించిన పనే . మరి  కెప్టెన్ గా సకెస్స్ అయిన  గంగూలీ పాలనా పరంగా  ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: