టీమిండియా మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే పదవి కాలాన్ని పొడిగించే అవకాశం ఉండి ఉంటే అప్పుడే అతడిని ఆపేవాడినని బీసీసీఐ పరిపాలక కమిటీ (  సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ వ్యాఖ్యానించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ నియామకం కావడంతో 33 నెల‌లుగా బోర్డు కార్యకలపాలను పర్యవేక్షిస్తున్న సీఓఏ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు వినోద్ రాయ్‌తో పాటు డ‌యానా ఎడుల్జీ, లెఫ్టినెంట్ ర‌వి తోడ్జేలు సీఓఏ స‌భ్యులుగా కొనసాగారు. 


కోచ్ గా అనిల్ కుంబ్లే  అర్థాంతరంగా తప్పుకోవడంపై స్పందించిన రాయ్ కుంబ్లే తప్పుకునే సమయంలో తనకు అవకాశం ఉంటే అతడిని ఆపేవాన్ని అని వెల్లడించారు.  కుంబ్లే ఒక ఉత్తమ కోచ్‌. అతడి పదవి కాలాన్ని పొడిగించే అవకాశం ఉంటే బలవంతంగానైనా కొనసాగించేవాడిని.  కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగా కుంబ్లేను కొనసాగించే అవకాశం నా చేతుల్లో లేకుండా పోయింది. కుంబ్లేతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోహ్లీకి అభిప్రాయ బేధాలు తలెత్తడంతో కోచ్‌ను మార్చాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. సుదీర్ఘ చర్చల తర్వాత కోచ్‌ను మార్చాలని పట్టుబట్టడంతో కుంబ్లేకు వేటు తప్పలేదన్నారు.


 అటు ఈ వివాదంపై జంబో కూడా సరైన నిర్ణయం తీసుకున్నాడని రాయ్ ప్రశంసించాడు.  గౌరవంగా తన పదవికి రాజీనామా చేసిన కుంబ్లే.. తన గొప్పతనాన్ని నిలబెట్టుకున్నాడని రాయ్ పేర్కొన్నాడు.  ఆ సమయంలో కుంబ్లేను కొనసాగించడానికి కోహ్లీ ఆసక్తిగా లేడనే విషయాన్ని సచిన్, గంగూలీకి చెబితే వాళ్లు కూడా కోహ్లీతో చర్చించారని వెల్లడించారు.  


ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ తప్ప సరైన వ్యక్తి ఎవ్వరూ లేరని రాయ్ పేర్కొన్నాడు. దాదా నేతృత్వంలో మళ్లీ జట్టులో వివాదాలు రావని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. గంగూలీతో పాటు ఎన్నికైన మిగితా సభ్యులకు కూడా రాయ్ శుభాకాంక్షలు తెలిపారు


మరింత సమాచారం తెలుసుకోండి: