బంగ్లాదేశ్ తో  సిరీస్ కు  భారత జట్టును ప్రకటించింది  సెలక్షన్ కమిటీ.  ఈ సిరీస్ తో  శివమ్ దూబే, సంజు శాంసన్  , చాహల్ , శార్దూల్ ఠాకూర్  భారత  టీ 20 జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే వీరి ఎంపికలు పెద్దగా ఆశ్చర్యాన్ని  కలిగించేలేదు కానీ  ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో అదరగొట్టిన  నవదీప్ సైని ని  మాత్రం  జట్టు నుండి తప్పించడం  ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.  విండీస్ తో సిరీస్ తర్వాత సౌతాఫ్రికా తో టీ 20 సిరీస్ కు ఎంపికైయ్యాడు సైని.  ఆసిరీస్ లో మాత్రం  అతను ప్రభావం చూపలేకపోయాడు. దాంతో సైనిని బంగ్లా తో టీ 20 సిరీస్  కు తప్పించారు.  అయితే  చీఫ్ సెలక్టర్  ఎం ఎస్ కె ప్రసాద్ మాత్రం  మైనర్  ఇంజురీ వల్లనే  సైనిని తప్పించామని చెప్పడం విశేషం.  సైని విషయంలో ప్రసాద్ ఇచ్చిన వివరణ  సాకుగానే కనబడడంతో   కేవలం ఒక్క సిరీస్ లో  విఫలమైనంత మాత్రాన  తీసేయాల్సిన అవసరం లేదు.  అలా అయితే  రిషబ్ పంత్ వరుసగా విఫలమవుతున్న మళ్ళీ మళ్ళీ అతనికి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని  బీసీసీఐ పై ఫైర్ అవుతున్నారు క్రికెట్ అభిమానులు. 




ఇక  టెస్టు సిరీస్ విషయానికి వస్తే  సౌతాఫ్రికా తో తలపడిన టీం నే బంగ్లాదేశ్ సిరీస్ కు ఎంపిక చేశారు సెలక్టర్లు.  అయితే   సౌతాఫ్రికా తో చివరి టెస్టు ముందు  రోజు  కుల్దీప్ యాదవ్ గాయం కారణం గా తప్పుకోవడం తో  అనూహ్యంగా  బీహార్ బౌలర్ షాబాజ్ నదీమ్ కు  పిలుపు వచ్చింది. దాంతో   నైట్  అంత  కోల్ కతా  నుండి రాంచి చేరుకోవడానికి  రోడ్డు ప్రయాణం చేసి  ఉదయాన్నే  జట్టుతో చేరాడు నదీమ్.  అతను పడ్డ కష్టానికి  తుది జట్టులో కూడా చోటు దక్కింది.  ఇక ఆమ్యాచ్ లో 4వికెట్ల తీసి  పర్వాలేదనిపించాడు.  దాంతో  బంగ్లా తో సిరీస్  కు కూడా ఎంపిక అవుతానాని ధీమా గా ఉండగా  నదీమ్ కు సెలక్టర్లు  షాక్ ఇచ్చారు.  కుల్దీప్ కోలుకోవడం తో మళ్ళీ అతని పైనే నమ్మకం ఉంచారు.  నిజానికి  కుల్దీప్ ట్రాక్ రికార్డు కూడా అంత ఆశాజనకంగా లేదు. అలాంటప్పుడు అతని స్థానం లో నదీమ్ కే మరో ఛాన్స్ ఇచ్చి చూడాల్సిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: