బంగ్లాదేశ్‌ క్రికెటర్లు సమ్మెకు దిగి తమ డిమాండ్లను నేరవేర్చలాంటూ సమ్మె చేసి,ఎలా అయితేనేమి మొత్తానికి తమ పంతం నెగ్గించుకున్నారు అనుకుంటున్న సమయంలో  మరో వివాదం చోటు చేసుకుంది. భారత్‌ పర్యటనకు సంబంధించి బంగ్లాదేశ్‌ క్రికెటర్లతో సమావేశమై బీసీబీ చీఫ్‌ నజ్ముల్‌ హసన్‌.. ఆల్‌ రౌండర్‌ మెహిది హసన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అని ,తన ఫోన్‌ కాల్‌ను మెహిదీ రిసీవ్ చేయకపోవడంపై సమావేశంలో హసన్‌ను బాగా  తిట్టిపోశారు అని తెలిసింది.

ఏంటి నాతోనే వేషాలు వేస్తున్నావా.. నీ నంబర్‌ ఇంక డిలీట్‌ చేసేస్తా అంటూ  తీవ్రంగా  మంది పడ్డారు. మెహిది.. సమావేశం ఉంటుందని తెలిసి కూడా నా ఫోన్‌ కాల్‌ను ఎత్తలేదు. ఇలాగైతే ఇంకా తనతో  కష్టం. ఇక మీదట తన నంబర్‌ను ఈ రోజు నుంచే నా కాంటాక్ట్స్‌ లిస్ట్‌ నుంచి తీసేస్తా అంటూ అందరి ముందు ఆగ్రహం వ్యక్తం చేసారు.నీకు ఏమి చేయలేదని  నా ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. ఈ రోజు నుంచి నీ నంబర్‌ ఇక నాకు అవసరం ఉండదు అంటూ వార్నింగ్‌ కూడా  ఇచ్చారు. అదే సమయంలో మిగతా క్రికెటర్లపై కూడా నజ్ముల్‌ తీవ్రంగా కోప్పడి,ఇదే అందరికి చివరి హెచ్చరిక అన్నట్టు చెప్పారని  తెలుస్తోంది.

ఇటీవల తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన గళం వినిపించకుండా స్ట్రైక్ కు దిగిన బంగ్లాదేశ్‌ క్రికెటర్ల దెబ్బకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు బీసీబీ  కిందకు దిగొచ్చింది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నుంచి క్రికెటర్లకు గురువారం స్పష్టమైన హామీ లభించడంతో స్ట్రైక్‌ను  వారు విరమించారు. ఈ మేరకు తమ క్రికెటర్లతో సుదీర్ఘ చర్చలు జరిపిన బీసీబీ.. సాధ్యమైనన్ని డిమాండ్లను నేరవేర్చడానికి గ్రీన్‌ సిగ్నల్‌  ఇచ్చింది.

మొత్తం 11 ప్రధాన డిమాండ్లతో నిరసన గళం వినిపించగా వాటిలో తొమ్మిది డిమాండ్లను తీర్చడానికి బీసీబీ ముందుకొచ్చింది. ఫలితంగా షకిబుల్‌ హసన్‌ నేతృత్వంలోని క్రికెటర్లు సమ్మె విరమించడంతో భారత్‌ పర్యటనకు మార్గం సులువు  అయ్యింది. దానిలో భాగంగా సమావేశం ఏర్పాటు చేయగా బీసీబీ చీఫ్‌ తన ఆక్రోశాన్ని అంతా  క్రికెటర్లపై చూపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: