'ఈ ప్రపంచంలో ఏ పనిని తక్కువగా చూడకూడదని నిరూపించారు' ఓ దేశ ప్రధానమంత్రి. ప్రధానమంత్రి క్రికెట్ గ్రౌండ్‌లో పరిగెడుతూ.. క్రికెటర్లకు కూల్ డ్రింక్స్ ఇవ్వడం చూశారా? ఇప్పుడు చూడొచ్చు. దేశ ప్రధానిగా అత్యుత్తమైన హోదా ఉన్నా.. క్రికెట్‌పై ఉన్న ఇష్టంతో వాటర్‌ బాయ్‌ అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ ప్రధానమంత్రి ఎవరోకాదు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్. ఆస్ట్రేలియా- శ్రీలంక మధ్య జరిగిన టీ20 వార్మప్‌ మ్యాచ్‌లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. 


ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం లసిత్‌ మలింగ నేతృత్వంలోని శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఆదివారం అడిలైడ్‌ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ ప్రారంభం కానుంది. తొలి టీ20 కోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కాన్‌బెర్రాలోని ఓవల్‌ మైదానంలో ఆస్ట్రేలియా ప్రైమ్‌ మినిస్టర్‌ XI, శ్రీలంక జట్లు గురువారం వార్మప్ మ్యాచ్‌లో తలపడ్డాయి.  ఆస్ట్రేలియా పీఎం 11 వర్సెస్ శ్రీలంక మధ్య సన్నాహక మ్యాచ్ ఆస్ట్రేలియాలోని ఓవల్‌లో జరుగుతోంది. 


ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా అధ్యక్షుడు హాజరయ్యారు. ఈ మ్యాచ్‌ 16వ ఓవర్‌లో లంక ఆటగాడు దసున్ శనక వికెట్‌ను ఆసీస్ పేసర్ డేనియల్‌ ఫాలిన్స్‌ తీయగానే.. ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌ శీతల పానీయాల పెట్టెతో మైదానంలోకి పరుగెత్తారు. ఆటగాళ్లందరికీ పానీయాలు అందించారు.  అంతేకాదు వారితో కరచాలనాలు చేశారు. ఈ ఊహించని ఈ పరిణామంతో ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. అనంతరం అందరూ శీతల పానీయాలు తాగుతూ ప్రధానితో మాట్లాడారు. ఇలా  ఆటగాళ్లకు శీతల పానీయాలు అందించి 'మారిసన్‌' ఔరా అనిపించుకున్నారు.

స్కాట్‌ మారిసన్‌ తెలుపు రంగు షర్టు, నల్ల రంగు ప్యాంటు ధరించి ఆసీస్‌ జట్టు క్యాప్‌ను ధరించి మైదానంలో వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలకు నెటిజన్లు తమదైన స్థాయిల్లో కామెంట్లు పెడుతున్నారు. 
'మీరు గ్రేట్‌ సార్‌', 'ప్రధాని గారు మీకు హాట్సాఫ్‌' అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొన్నామధ్య మోడీ గారు కూడా బీచ్ లో ప్లాస్టిక్ వ్యర్దాలను ఏరుతూ అందరికి షాక్ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: