ప్రపంచ కప్ లో  అవమానకర రీతిలో ఓడిపోయి  లీగ్ దశలోనే  ఇంటి ముఖం  పట్టి  విమర్శలు  ఎదుర్కొన్న  సౌతాఫ్రికా  క్రికెట్ జట్టు తాజాగా  ఇండియా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా అంతే అవమానకరంగా ఓడిపోయి సొంత గడ్డ పై అడుగు పెట్టింది.  దాంతో ఆ విమర్శలు తారాస్థాయికి చేరాయి.  ప్రపంచ క్రికెట్ లో  సౌతాఫ్రికా ఎంతటి టీం నైనా  వారి సొంత గడ్డ పై ఓడించిన దాఖలాలు ఎన్నో.. కానీ   గత  కొన్నేళ్లుగా  ఆ  టీం పరిస్థితి ఆందోళన కరంగా  వుంది.  ట్యాలెంటెడ్  క్రికెటర్  డివిలియర్స్  అనూహ్యంగా రిటైర్మెంట్  ప్రకటించడం తో  ఆజట్టు పతనం  ప్రారంభమైంది.  ఆతరువాత ఇటీవల స్టార్  ప్లేయర్స్   హషిమ్  ఆమ్లా , డేల్ స్టెయిన్ కూడా  వీడ్కోలు పలుకడంతో  ఆ జట్టు కష్టాలు  ఎక్కువయ్యాయి.  ప్రపంచ కప్ లోనైతే  డివిలియర్స్ లేని లోటు  కొట్టొచిన్నట్లు కనిపించింది.   


ఇదిలా ఉంటే  ఇండియా తో  టెస్ట్ సిరీస్ అనంతరం  ఓటిమి పై విశ్లేషణ ఇవ్వడానికి  దక్షిణాఫ్రికా  క్రికెట్ బోర్డు  తాజాగా మీడియా సమావేశాన్ని  ఏర్పాటు చేసింది.  ఈ సమావేశంలో పాల్గొన్న కెప్టెన్ డుప్లెసిస్ ఓటిమికి గల కారణాలు  వివరించాడు. మూడు మ్యాచ్ ల్లో  ఒక్క మ్యాచ్ లో కూడా మేము టాస్ గెలువలేకపోయామని ప్రతి సారి ఇండియానే టాస్ గెలిచి బ్యాటింగ్  తీసుకోవడం ఆతరువాత 500 స్కోర్ చేయడం , మబ్బులు కమ్మేసే సమయానికి  డిక్లేర్ చేయడం,  ఆతరువాత  బ్యాటింగ్ దిగిన మేము  వేంటనే మూడు వికెట్లు కోల్పోవడం...మూడు టెస్టుల్లో  ఇలాగే జరిగిందని చక్కటి స్ట్రాటజీ తో  భారత్  సిరీస్ ను క్వీన్ స్వీప్ చేసింది. టాస్ గెలిచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఓవర్సీస్ లో జరిగే టెస్ట్ మ్యాచ్ ల్లో  టాస్ ఓడిపోతే   ప్రతి మ్యాచ్  ఇండియా తో  జరిగిన టెస్ట్ సిరీస్  లాగే  కాపీ పేస్ట్ లా ఉంటుందని  డుప్లెసిస్  అసహనం వ్యక్తం చేశాడు. 



ఇక  మళ్ళీ  జట్టు పునర్నిర్మాణం  జరగాలంటే  అందుకు మాజీ క్రికెటర్ల సహాయం అవసరం.  అయితే  ఆర్థికంగా  బోర్డు కు ఇది ఇబ్బంది  కలిగించే విషయమే కానీ  ప్రస్తుతం టీం లో చాలా మంది కొత్త వారే.  ఈ సమయంలో  వారికీ సలహాలు సూచనలు  ఇవ్వడానికి మాజీ ఆటగాళ్ల సాయం తప్పినిసరి..  టీం పరిస్థితి ఇంకా  దిగజారకముందే  మేము జట్టును  పునర్నిర్మించు కోవాల్సిన  అవసరం  వుంది.   ఈ విషయంలో బోర్డు  మాకు అన్ని విధాలా  అండగా ఉంటుందని అనుకుంటున్నానని  డుప్లెసిస్ ఆశా భావం వ్యక్తం చేశాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: