అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న  బౌలర్ గా చెత్త రికార్డు సృష్టించాడు శ్రీలంక యువ ఫాస్ట్  బౌలర్  కసున్ రజిత. అడిలైడ్   వేదికగా ఆదివారం ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ లో  రజిత నాలుగు ఓవర్లలో  వికెట్లమీ తీయకుండా  75పరుగులు ఇచ్చి ఈ రికార్డు సృష్టించాడు. ఇక  ఈమ్యాచ్ లో  మొదట  టాస్  గెలిచి ఫిల్డింగ్  తీసుకున్న శ్రీలంక కు ఆసీస్ ఓపెనర్లు  ఆరోన్  ఫించ్  ,డేవిడ్ వార్నర్  చుక్కులు చూపెట్టారు.  వీరిద్దరూ  బౌండరీల తో చెలరేగడంతో  9 ఓవర్ల లోనే  ఆజట్టు స్కోరు100పరుగులు  దాటింది. అయితే మరింత ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని సందకన్ విడదీశాడు.   64పరుగులుచేసి   ఫించ్ మెండిస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆతరువాత   వచ్చిన మ్యాక్స్ వెల్  చిన్నపాటి విధ్వసంమే సృష్టించాడు.  కేవలం  28బంతుల్లోనే 62 పరుగులతో చెలరేగిపోయాడు.  మరో వైపు  నుండి వార్నర్ కూడా దూకుడుగా  ఆడి కెరీర్ లో మొదటి సెంచరీ పూర్తి చేశాడు.  దాంతో  20ఓవర్ల లో ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేయగా  56బంతుల్లోనే 100 పరుగులు చేసి వార్నర్ అజేయంగా నిలిచాడు. 



అనంతరం భారీ  లక్ష్యంతో బరిలోకి దిగిన  శ్రీలంక 20ఓవర్ల లో  9వికెట్లు కోల్పోయి  99పరుగులుమాత్రమే  చేసి ఘోర పరాజయాన్ని  చవిచూసింది. ఆసీస్ బౌలర్ల  దాటికి  శ్రీలంక  బ్యాట్స్ మెన్  క్రీజ్ లో నిలబడలేకపోయారు.  ఆసీస్  బౌలర్ల లో  జంపా 3, కమ్మిన్స్ 2 ,స్టార్క్ 2  వికెట్లు తీయగా అగార్ ఓ వికెట్ తీశాడు. ఈవిజయంతో  ఆస్ట్రేలియా  మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: