బంగ్లాదేశ్‌తో వచ్చే నెల 3 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌ కోసం జట్టుని ప్రకటించిన భారత సెలక్టర్లు అందులో పవర్ హిట్టర్‌ శివమ్ దూబేకి అనూహ్యంగా అవకాశం ఇచ్చారు. దేశవాళీ క్రికెట్‌ లో ఇటీవల భారీ సిక్సర్లు కొడుతూ కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ 26 సంవత్సరాల ముంబయి ఆల్‌ రౌండర్‌ ని హార్దిక్‌ పాండ్యా స్థానంలో ఎంపిక చేసినట్లు సెలక్టర్లు ప్రకటించారు. 


2018-19 సంవత్సరానికి రంజీ ట్రోఫీలో ముంబయి తరపున నిలకడగా రాణించిన శివమ్ దూబే తన పవర్ హిట్టింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. గుజరాత్‌ తో జరిగిన ఒక మ్యాచ్‌లో ముంబయి జట్టు 74/5 తో నిలిచిన దశలో క్రీజు లోకి వచ్చిన శివమ్ దూబే 128 బంతుల్లోనే 110 పరుగులు చేశాడు. ఆ తర్వాత బరోడాతో జరిగిన మరో మ్యాచ్‌ లో ముంబయి జట్టుకి భారీ స్కోరు అవసరమైన దశలో భారీ సిక్సర్లతో దూబే ఒక ఊపు ఊపేసాడు. స్పిన్నర్ ఎస్.సింగ్ వేసిన ఒకే ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లతో బాదేసిన శివమ్, యువరాజ్ సింగ్ తరహాలో ఆరో సిక్సర్‌ కూడా సాధించేలా కనిపించాడు. కానీ ఆ ఓవర్ ఆఖరి బంతిని బౌలర్ వైడ్ రూపంలో విసరడంతో అతనికి నిరాశ ఎదురైంది. అయినప్పటికీ అతని పవర్ హిట్టింగ్‌ కి ఒక మంచి గుర్తింపు దక్కింది.


ఇటీవల ఇటలీలో వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న హార్దిక్ పాండ్య క్రికెట్‌ కి దూరంగా ఉంటుండటంతో అతని స్థానంలో శివమ్ దూబేకి తొలిసారి భారత్ జట్టులో సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. కెరీర్‌లో ఇప్పటి వరకూ 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ లు  మాత్రమే ఆడిన లాడిన శివమ్ 1,012 పరుగులు చేయగా ఇందులో రెండు శతకాలు, ఏడు అర్ధశతకాలు ఉన్నాయి. ఒక్క బ్యాట్ తోనే కాకుండా  బంతితోనూ ఈ ఆల్‌రౌండర్ నిలకడగా రాణిస్తూ 40 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్‌ లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడిన శివమ్ దూబే సిక్సర్లతో అభిమానుల చోరగొన్నాడు.


బాంగ్లాదేశ్ తో జరిగే భారతదేశ క్రికెట్ జట్టు ని ఈ విధంగా ప్రకటించారు. ఈ విధంగా జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, సంజుశాంసన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కృనాల్‌ పాండ్య, చాహల్, రాహుల్ చాహర్, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, శివమ్ దూబే, శార్ధూల్ ఠాకూర్.

మరింత సమాచారం తెలుసుకోండి: