భారత్  పర్యటనకు ముందు బంగ్లాదేశ్ జట్టుకు  భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు  స్టార్ అల్ రౌండర్ ,టెస్ట్ , టీ 20 కెప్టెన్  షకిబుల్ హాసన్  పై ఐసీసీ  రెండేండ్లు నిషేధం విధించింది. గత ఏడాది  బుకీలు  పలు మార్లు  షకీబ్ ను సంప్రదించినా కూడా  ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి   షకీబ్ ఎలాంటి సమాచారం  ఇవ్వకపోవడంతో  అతని పై వేటు వేసింది ఐసీసీ.  ఇక తన నిషేధం గురించి స్పందిస్తూ..  నేను ప్రేమించే ఆటకు దూరమవ్వడం చాలా బాధాకరం కానీ నేను చేసింది తప్పే ఐసీసీ  అవినీతి  నిరోధక విభాగం  నిబంధనలను పాటించడంలో విఫలమయ్యాను.  యువ ఆటగాళ్లు ఇలాంటి తప్పులు చేయకుండా ఉండేందుకు ఇక నుండి  ఐసీసీ తో కలిసి పనిచేస్తానని  షకీబ్ అన్నాడు. 



ఇక తాజాగా  షకీబ్ నిషేధం గురించి  అతని సతీమణి  షకీబ్ ఉమ్మే ఆల్  హాసన్  కూడా  సోషల్ మీడియా ద్వారా  స్పందించింది.  లెజెండ్స్  ఒక్క నైట్ లోనే  లెజెండ్స్ అయిపోయారు. ఎన్నో  ఒడిదుడుకులు  ఎదుర్కొని ఆ స్థాయికి చేరుకుంటారు.  షకీబ్ మైండ్ సెట్ ఎంత స్ట్రాంగో   మాకు తెలుసు .. ఖచ్చితంగా అతను మళ్ళీ స్ట్రాంగ్ గా కం బ్యాక్ అవుతాడు గతంలో కూడా గాయాలతో ఆటకు దూరమైనప్పడు  అంతే స్ట్రాంగ్ మైండ్ సెట్ తో  తిరిగి మళ్ళీ జట్టులోకి వచ్చాడు.  ఇప్పుడు  కూడా అతను  మళ్ళీ తప్పకుండా  జట్టులోకి వస్తాడు.   మాకు ఇంత  సపోర్ట్ ను అలాగే  ప్రేమను ఇస్తున్న బంగ్లా క్రికెట్ అభిమానులకు ధన్యవాదాలు అని  షకీబ్ ఉమ్మే ఆల్  హాసన్ తెలియజేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: