బంగ్లాదేశ్ జట్టు మాజీ  కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా అండగా నిలిచారు.  షకీబ్ అల్ హసన్ పై రెండేళ్లపాటు ఐ.సి.సి నిషేధం విధించిన విషయం తెలిసిందే.  షకీబ్ అల్ హసన్ పై అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా ఐసీసీ నిషేధం విధించిన  అనంతరం షేక్ హసీనా  మీడియాతో మాట్లాడుతూ షకీబ్ పొరపాటు చేశాడని , ఆ విషయాన్ని అతను కూడా ఒప్పుకున్నాడని చెప్పింది .  ఐసీసీ నిర్ణయం పై బంగ్లాదేశ్ ప్రభుత్వం, క్రికెట్ బోర్డులు ఏమి  చేయలేవన్న ఆమె ,  ఈ విపత్కర   సమయంలో షకీబ్ కు  అండగా నిలవాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సూచిస్తున్నట్లు పేర్కొన్నారు.


 షకీబ్  గొప్ప క్రికెటర్ అని సుదీర్ఘకాలంగా దేశానికి ఎన్నో అపూర్వ విజయాలను అందించాడని,  ఐసీసీ విధించిన నిషేధం  ముగిసిన తర్వాత తిరిగి జట్టులోకి వచ్చి  దేశానికి సేవ చేస్తాడని ఆశిస్తున్నట్టు  బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు  పేర్కొంది.  మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని  కొందరు బుకీలు, షకీబ్ ను  సంప్రదించిన సమయంలో అవినీతి నిరోధక బృందానికి  అతడు  సమాచారం ఇవ్వకపోవడం తో షకీబ్ పై  చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ ప్రకటించింది.  గత ఏడాది లో  జరిగిన రెండో టోర్నీల సందర్బంగా షకీబ్ ను బుకీలు సంప్రదించారు .


 బుకీలు ఎవరైనా ఆటగాళ్లను సంప్రదించిన వెంటనే ఐసీసీ నిబంధనల మేరకు , అవినీతి నిరోధక విభాగం అధికారులకు తెలియజేయాలి . కానీ షకీబ్ తనని బుకీలు సంప్రదించిన విషయాన్ని దాచిపెట్టి , ఐసీసీ అవినీతి నిరోధక విభాగం అధికారులకు తెలియజేయకపోవడం తో , అతనిపై ఐసీసీ రెండు అభియోగాలను మోపింది  . ఐసీసీ అవినీతి విభాగం అధికారులు మోపిన అభియోగాలని షకీబ్ అంగీకరించడం తో అతనిపై రెండేళ్లపాటు నిషేధం విధించింది .


మరింత సమాచారం తెలుసుకోండి: